28.07.2021 press note

హాలియా,జులై 28.రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆగస్ట్ 2 వ తేదీన హాలియా రానున్నట్లు సమాచారం అందటం తో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,డి.ఐ. జి.ఏ.వి.రంగానాథ్ తో కలిసి పరిశీలించారు.హాలియా పట్టణం లో   సాగర్ నియోజకవర్గ,పట్టణ అభివృద్ధి పై సమావేశం నిర్వహించనున్నారు.హాలియా ప్రభుత్వ పట్టణ పారిశ్రామిక శిక్షణా సంస్థ లో సమావేశం ఏర్పాట్లు పై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,డి.ఐ. జి.ఏ.వి.రంగనాథ్ లు రెవెన్యూ,మున్సిపల్,ఆర్&బి, విద్యుత్ శాఖ ల అధికారులతో చర్చించి సూచనలు చేశారు.హెలిపాడ్ ఏర్పాట్లు పై కూడా చర్చించారు.జిల్లా కలెక్టర్ తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్,ఆర్.డి.ఓ.రోహిత్ సింగ్,మున్సిపల్ కమిషనర్ వేమా రెడ్డి, ఆర్&బి ఈఈ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
*హాలియా పట్టణం లో పర్యటించిన జిల్లా కలెక్టర్*
హాలియా పట్టణం లో  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రహదారులు,వీధుల వెంబడి పర్యటించారు. పట్టణం వీధులు పరిశుభ్రంగా ఉంచాలని,ఇన్స్పెక్షన్ బంగ్లా వద్ద రహదారి వెంబడి పెద్ద మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.హరి విల్లు ఎస్టేట్ తేరా చిన్నపరెడ్డి నగర్ లో వెంచర్ ఓపెన్ స్థలం లో పట్టణ ప్రకృతి వనం పరిశీలించారు.పట్టణ ప్రకృతి వనం లో మొక్కలు నాటాలని ఆదేశించారు.ఫెన్సింగ్ దిమ్మెలకు కలరింగ్ చేయాలని అన్నారు. అనంతరం ఎన్. ఎస్
పి.కెనాల్ వెంబడి మొక్కలు నాటి పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని అన్నారు.పట్టణం లో ఇబ్రహీం పేట లో గల పట్టణ ప్రకృతి వనం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ తో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్,మున్సిపల్ కమిషనర్ వేమారెడ్డి లు ఉన్నారు.

Share This Post