అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం*

*అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 6 అంగన్వాడీ టీచర్,11 ఆయా పోస్టులకు ఈనెల16 లోగా దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ తూముల నిర్మల ఒక ప్రకటన లో కోరారు. నల్గొండ పట్టణంలో ఐదు టీచర్లు,కనగల్ మండలంలోని తిమ్మన్నగూడెంలో ఒకటి.. పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. అదేవిధంగా తిప్పర్తి, కనగల్, నల్గొండ మండలం, నల్గొండ పట్టణంలో 11 ఆయా పోస్టులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అభ్యర్థులు htpp://wdcw.tg.nic.in, htpp://mis.tgwdcw.in అనే వెబ్ సైట్ లో ఆగస్టు16 సాయంత్రం5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం కార్యాలయ పని వెళ్లాలో సంప్రదించాలని కోరారు.

Share This Post