ప్రచురణార్ధం

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి…

మహబూబాబాద్ జూలై 31.

సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్యాధికారులు గ్రామాలలో విస్తృతంగా పర్యటించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

శనివారం కలెక్టర్ కార్యాలయంలో సీజనల్ వ్యాధులపై సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా కేసులు పెరగరాదని, గ్రామస్థాయి అధికారులు వైద్య అధికారులతో కలిసి సమన్వయంతో విస్తృతంగా పర్యటించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని మందులు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే 18 వేల దోమతెరలు ఏజెన్సీ ప్రాంతాల్లో పంపిణీ చేశామని వాటి వినియోగం ను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. సీజనల్ వివరాలపై ముద్రించిన కరపత్రాలు విస్తృతంగా పంపిణీ చేయాలన్నారు.
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఫాగింగ్ మిషన్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా మున్సిపాలిటీలలో కూడా ఫాగింగ్ చేపట్టాలన్నారు.
గ్రామాలలో విస్తృత ప్రచారం కొరకు ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు గ్రామపంచాయతీ ట్రాక్టర్లు కు మైకులు ఏర్పాటుచేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకొనవలసిన జాగ్రత్తలను రికార్డింగ్ చేసి ప్రజలకు వినిపించాలి అన్నారు. డ్రైనేజీ లలో ఆయిల్ బాల్స్ వేయించాలని గంబుషియా చేప పిల్లలను నిల్వ ఉన్న నీటిలో విడిచిపెట్టాలి అన్నారు. ఉపాధ్యాయులచే ర్యాలీలు ఏర్పాటు చేయించాలని సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన పరచాలన్నారు.
వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేయాలని అన్నారు.
కోవిద్ పై వ్యాపారస్తుల తో సమావేశం ఏర్పాటు చేయాలని సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు గ్రామాలలో పట్టణాలలో మాస్క్ ఎన్ ఫోర్స్ మెంట్ తప్పనిసరిగా జరగాలన్నారు.
పండుగలు నిషేధించినట్లు తెలియజేస్తూ అతిక్రమిస్తే జరిమానా విధించడం జరుగుతుందన్నారు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కొమరయ్య జడ్పీ సీఈవో అప్పారావు జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు డి ఆర్ డి ఎ పి డి సన్యాసయ్య ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకులు వెంకట్ రాములు జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్ జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు
————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post