29.07.2018 ప్రపంచం లో,దేశం లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం లో 50 కు పైగా సంక్షేమ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సారథ్యం లో అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు

నాంపల్లి,జులై 29. ప్రపంచం లో,దేశం లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం లో 50 కు  పైగా సంక్షేమ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సారథ్యం లో అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు.గురువారం నాంపల్లి మండలం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాం పల్లి ,మర్రి గూడ మండలం లకు చెందిన లబ్ది దారులకు నూతన ఆహార భద్రతా కార్డులు,షాది ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులు మంత్రి పంపిణీ చేశారు.2014 కు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఆంధ్ర ప్రదేశ్ లో ఆకలి చావులు,రైతుల ఆత్మ హత్యలు,బుక్కెడు నీటి కోసం కి.మీ.దూరం ఆడ బిడ్డలు పోవాల్సిన పరిస్థితులు ఉండేవి,మునుగోడ్ లో 1979 లోమొదలైన ప్లోరైడ్ భూతం నియోజకవర్గం దాటి 1000 గ్రామాల్లో విస్తరించిందని అన్నారు
మునుగోడ్ నియోజక వర్గం లొనే మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించి మంచి నీటి సమస్య పరిష్కరించినట్లు,పార్లమెంట్ లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ప్లోరైడ్ లేదని ప్రకటించిరాని అన్నారు.
2014 కు ముందు తర్వాత పోల్చుకుంటే రాష్జ్త్రం లో అభివృద్ధి అర్థం అవుతుందని అన్నారు.2001 లో ఉద్యమ నాయకుడు గా స్వరాష్ట్ర ఏర్పాటుకు ప్రజలను ఐక్యం చేసి ,తన ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించారని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆకలి చావులు లేకుండా ఎవరూ అడగని విధంగా,మ్యానిఫెస్టోలో లో ప్రకటించని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.45 వేల కోట్ల రూ.లు పైగా సంక్షేమ రంగం పై ఖర్చు చేసి అద్భుత మైన పరిపాలన తో దేశం లొనే ఆదర్శ వంతమైన రాష్ట్రం గా నిలిచిందని,దేశం లో ఏ రాష్ట్రం లో నైనా తెలంగాణ పథకాలు అమలు చేస్తున్నాయని ఆయన తెలిపారు.వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్,రైతు అప్పులు పాలు కాకుండా రైతు బంధు కింద ఎకరానికి 10000 రూ.లు పెట్టుబడి సాయం,రైతు భీమా, తల్లి బిడ్డల ఆరోగ్య రక్షణ కు కె.సి.ఆర్.కిట్,ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత ప్రసవాలు,మగ పిల్ల వాడు అయితే 12 వేలు,ఆడ పిల్ల ప్రసవిస్తే 13 వేల రూ.లు,కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ కింద ఆడ బిడ్డ పెండ్లికి ఒక లక్షా 116 రూ.లు ఆర్థిక సాయం వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.60 సం ల లో జరగని విధంగా మునుగోడ్ నియోజక వర్గం లో రోడ్లు నిర్మాణం జరిగి నట్లు,నియోజకవర్గలో రోడ్లు సమస్య పరిష్కారం చేస్తానని, నాంపల్లి మండలం లో బస్ స్టాండ్ ఏర్పాటు సమస్య పరిష్కారం కు కృషి చేస్తానని అన్నారు.సూర్యా పేట నియోజక వర్గం తో పాటు మునుగోడ్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని అన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా లో అర్హులైన వారందరికీ నూతనంగా 11395 ఆహార భద్రత కార్డులు మంజూరు చేసినట్లు, మునుగోడ్ నియోజక వర్గం లో 2038 ఆహార భద్రతా కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ రోజు నాం పల్లి మండలం లోని లబ్ధిదారులకు 456 మంది కి,మర్రిగూడ మండలం లోని 390 మంది లబ్ధి దారులకు నూతన ఆహార భద్రతా కార్డులు మంజూరు చేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వి. వెంకటేశ్వర్లు,ఎం.పి.పి.లు,జడ్
పి.టి.సి
లు,మండల అధికారులు పాల్గొన్నారు.

Share This Post