ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు:: జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి

ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు:: జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి

జనగామ, ఆగస్టు 05: ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు ఉంటాయని జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. గురువారం జనగామ మండలం, వడ్లకొండ గ్రామంలో రైతు రవీందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో చేస్తున్న ఆయిల్ పామ్ సాగును ఎమ్మెల్యే, జిల్లా ఉద్యానవన అధికారిణి కేఆర్. లతతో కలిసి పరిశీలించి, ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వంచే భౌతిక లక్ష్యంగా 400 ఎకరాలు సాగుకు నిర్దేశించబడిందని, మొక్కలపై హెక్టరునకు రూ. 12 వేల రాయితీ ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎరువులపై మొదటి 4 సంవత్సరాలకు హెక్టర్ నకు రూ. 20 వేలు, పంట కోత పరికరాలు, గెలల రవాణా కొసం సబ్సిడి లభిస్తుందని అన్నారు. బిందు సేద్యం పరికరాల పై 80 శాతం నుండి 100. శాతం వరకు సబ్సిడి ఇస్తారన్నారు. తుఫానులు, వరదలు వచ్చినప్పుడు ఆయిల్ పామ్ సాగులో పంట నష్టం వాటిల్లదని,
కోతులు, పశు పక్ష్యాదులవల్ల ఈ పoటకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన అన్నారు. రైతులు ఆయిల్ పామ్ సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో జనగామ ఎంపిపి. కళింగరాజు, జెడ్పీటీసి దీపికా రెడ్డి, స్థానిక సర్పంచ్ బొల్లం శారద స్వామి, డిఎఓ టి. రాధిక, ఆయిల్ ఫెడ్ అభివృద్ది అధికారి రఘువీరారెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి జనగామచే జారీ చేయనైనది

Share This Post