పత్రిక ప్రకటన,
తేది :- 06.08.2021.
ఈరోజు వికారాబాద్ పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఆచార్య జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమం కొసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు అని పేర్కున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, అయన కలగన్న బంగారు తెలంగాణ రాష్ట్ర నిర్మాణం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ గారు,మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల రమేష్ గారు,పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు