ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో పయనించాలి,కలెక్టరేట్లో నివాళులర్పించిన జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్

పత్రిక ప్రకటన–1 తేదీ : 06–08–20201
=======================================
ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో పయనించాలి
కలెక్టరేట్లో నివాళులర్పించిన జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్
ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎన్నో విధాలుగా పాటుబడిన ప్రొఫెసర్ జయశంకర్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిప్రధాత అని… ఆయన చూపిన బాటలో నడుచుకోవాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ అన్నారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జయశంకర్ చిత్రపటానికి డీఆర్వో లింగ్యానాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్వో లింగ్యానాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి దారి చూపిన స్ఫూర్తి ప్రధాన ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరు పయనించాలని కోరుకున్న బంగారు తెలంగాణ సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలోసి.పి.ఓ , మోహన్ రావు కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్లోని ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post