3వ తేదీ, 10వ తేదీన జరిగే పదో తరగతి పరీక్షల కాంపోజిట్ తెలుగు, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సైన్స్ పరీక్షలకు కేటాయించిన 20 నిమిషాల అదనపు సమయాన్ని పరీక్షలు రాసే విద్యార్థులు గమనించి 10 పరీక్షలను విజయవంతంగా రాయాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

3వ తేదీ, 10వ తేదీన జరిగే పదో తరగతి పరీక్షల కాంపోజిట్ తెలుగు, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సైన్స్ పరీక్షలకు కేటాయించిన 20 నిమిషాల అదనపు సమయాన్ని పరీక్షలు రాసే విద్యార్థులు గమనించి 10 పరీక్షలను విజయవంతంగా రాయాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

2023 ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు మొదటి లాంగ్వేజ్ మరియు సైన్స్ పరీక్ష పేపర్లు అదనపు సమయాన్ని కేటాయించిన పరీక్షల వివరాలను విద్యార్థులు గమనించాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్ 3వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్, 4వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 6వ తేదీన థర్డ్ లాంగ్వేజ్ పరీక్షలు ఉంటాయి.
8వ తేదీన మేథమేటిక్స్, 10వ తేదీన సైన్స్, 11వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలను షెడ్యూల్ వారిగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక్కో సబ్జెక్టులో పరీక్షలకు 80, ఫార్మెటివ్ అసెస్ మెంట్ కు 20 మార్కులు ఉంటాయని తెలిపారు.
సైన్స్ పేపర్‌లో ఫిజిక్స్, బయోలజీకి చెరి సగం మార్కులను ఇచ్చేలా కొత్త విద్యా విధానాన్ని రూపొందించినట్లు కలెక్టర్ చెప్పారు.
అన్ని సబ్జెక్టులకు పరీక్ష సమయం 3 గంటలు ఉండగా.. కాంపోజిట్ తెలుగు సైన్స్ ‌కు అదనంగా 20 నిమిషాల పాటు సమయం కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 3వ తేదీ కాంపోజిట్ తెలుగు పేపర్ పార్ట్ వన్ కు 60 మార్కులు పేపర్ 2 గంటల పాటు సమయాన్ని నిర్ణయించారు, ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు, పార్ట్ బి పేపర్ 30 నిమిషాలు కాంపోజిట్ తెలుగు పేపర్ కు పార్ట్ వన్ పేపర్ తీసుకొని పార్ట్ 2 పేపర్ ఇచ్చేందుకు 20 నిమిషాలు కేటాయించబడిందని, గంటల నుండి 11:50 గంటల నుండి 12:50 గంటల వరకు ఉంటుందని, అదేవిధంగా ఏప్రిల్ 10వ తేదీ నాటి సైన్స్ పరీక్షకు ఫిజికల్ సైన్స్ పేపర్ 40 మార్కుల పేపర్ కు 1 గంట 30 నిమిషాలకు సమయం కేటాయించగా అనగా ఉదయం 9:30 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు 15 నిమిషాలు ఫిజికల్ సైన్స్ ఆబ్జెక్ట్ ప్రశ్నపత్రాలకు సమయాన్ని కేటాయించగా 11 గంటల నుండి 11 గంటల 20 నిమిషాల వరకు ఆబ్జెక్ట్ ప్రశ్నాపత్రాలకు 15 నిమిషాల అనంతరం పూర్తయినటువంటి ఫిజికల్ సైన్స్ పేపర్ ను తీసుకొని జీవశాస్త్రం పేపర్ ను ప్రశ్నపత్రాలను ఇచ్చేందుకు 20 నిమిషాల సమయాన్ని అదనంగా కేటాయించడం అయినది.
11 గంటల 20 నిమిషాల నుండి 12 గంటల 50 నిమిషాల వరకు జీవశాస్త్రం పార్ట్ ఏ మరియు పార్ట్ బి పరీక్ష ప్రశ్నాపత్రం రాసేందుకు సమయాన్ని కేటాయించారని, ఆబ్జెక్ట్ జీవశాస్త్రానికి 15 నిమిషాల సమయాన్ని కేటాయించిన ఆయా పరీక్షల అదనపు సమయాలను పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు సద్వినియోగం చేసుకొని పరీక్షలను విజయవంతంగా రాయాలని, అదేవిధంగా ఇన్విజిలేటర్లు సైతం మార్పును గమనించాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు

Share This Post