3వ, 16వ, 17వ, 18వ వార్డుల లోని వ్యాక్సినేషన్ కేంద్రాల తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన తేది:21 .9 2021
వనపర్తి.

కరోనా వ్యాక్సిన్ వేయించడంలో ప్రజా ప్రతినిధుల పాత్ర ఎంతో ఉందని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
మంగళవారం వనపర్తి పట్టణంలోని 3వ, 16వ, 17వ, 18వ వార్డుల లోని వ్యాక్సినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ చేయించుకోవాలని, జిల్లాలో సెప్టెంబర్ 16 నుండి 20 వరకు సుమారు 45 వేల మందికి వ్యాక్సినేషన్ చేసినట్లుగా ఆమె తెలిపారు. ఈ ఒక్కరోజే సుమారు తొమ్మిది వేల పైచిలుకు మంది వ్యాక్సన్ వేయించుకున్నారని ఆమె సూచించారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి కరోనా వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆమె తెలిపారు.
వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో 89 సబ్ సెంటర్ లను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రతి కేంద్రంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండే విధంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సహకరించాలని ఆమె సూచించారు. ప్రతి గ్రామంలో అంగన్వాడి సిబ్బంది, ఆశా వర్కర్, ఏఎన్ఎం, అదేవిధంగా పట్టణాల్లో వార్డు మెంబర్లు బాధ్యతగా ప్రజల్లో అవగాహన కల్పించి 100% వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేలా కృషి చేయాలని ఆమె తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ వారికి దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి టీకా తీసుకోవాలని ఆమె సూచించారు.
సెప్టెంబర్ 16 నుండి ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో ఇప్పటివరకు మొదటి డోసు పూర్తి చేసిన వారు సుమారు 38 వేల మంది ఉన్నారని, రెండవ డోసు పూర్తి చేసిన వారు సుమారుగా 8 వేల వరకు వ్యాక్సిన్ చేయించుకున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు, సర్పంచులు సమన్వయంతో వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో డి.ఎం. & హెచ్ వో చందు నాయక్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సరిత, ఆశా వర్కర్ కమల, ఖాజా భాను, శారద, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post