73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం హైదరాబాద్ కలెక్టరేటులో ఘనంగా నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ శర్మన్ జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేసారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని అధికారులకు, ఉద్యోగులకు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులకు గణతంత్ర దినోత్సవ శుభాకంక్షలు తెలియజేసారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల కృషి ఫలితమే నేడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం అన్నారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు నిబద్దతతో వ్యవహరించాలన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలనీ, హైదరాబాద్ ను ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దెందుకు అందరు పునరంకితులు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ డి సి ఎల్ ఏ శ్రీనివాస్, ఎస్సి కార్పొరేషన్ ఈడీ రమేష్ కలక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

????????????????????????????????????

Share This Post