గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్ధం

గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలి… జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మహబూబాబాద్, ఆగస్ట్-09:

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.  కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజలు తమ సమస్యలను తెలుపుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తులు సమర్పించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దరఖాస్తుదారుల సమస్యలను విని సదరు దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ వెంటనే  సమస్యలను పరిష్కరించ వలసిందిగా ఆదేశించారు.

ట్రై సైకిళ్లు, పెన్షన్లు మంజూరు, పట్టా పాస్ బుక్, రేషన్ కార్డు ఇచ్చుటకు కోరుతూ గ్రీవెన్స్ లో దరఖాస్తులు సమర్పించారు.

కేశముద్రం మండలం కు చెందిన వల్లందాసు కట్టయ్య సర్వే నంబర్ 262/6 లో ఒక ఎకరం 20 గుంటల భూమిని 50 సంవత్సరాల క్రితం నుండి తండ్రి ద్వారా వారసత్వంగా సంక్రమించిన భూమి అని సదరు భూమిని రికార్డ్ లలో నమోదు చేసి పట్టా పాస్ బుక్ ఇవ్వాలని కోరారు.

మహబూబాబాద్ కు చెందిన ఏడ్ల చంద్రయ్య తనకు సర్వే నంబర్ 344/బి/1 లో గల భూమిని రికార్డ్ లలో నమోదుచేసి తహశీల్దార్ కార్యాలయం కువెల్లిన ఇప్పటివరకు నమోదు చేయలేదని, సదరు భూమిని రికార్డులో నమోదు చేసి పట్టా దార్ పాస్ బుక్ ఇప్పించాలని కోరారు.

నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం కు చెందిన పి. వెంకటమ్మ తాను నిరుపేద అని రేషన్ కార్డ్ ఇప్పించాలని కోరారు.

మహబూబాబాద్ బ్రాహ్మణ పల్లి కు చెందిన వికలాంగురాలు పస్తం ఎల్లమ్మ ట్రై సైకిల్ ఇప్పించాలని కోరారు.

స్థానికంగా హనుమంతరావు కాలనీలో ఇళ్ళ మధ్యలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఎక్కువ మంది ఒకేచోట గుంపులు, గుంపులుగా రావడంతో కాలనీవాసులకు ఇబ్బందిగా మారిందని, రాపిడ్ టెస్ట్ కు సంభందించిన స్క్రాప్ ను ఆసుపత్రి ఎదురుగా కాల్చడంతో కొందరికి బ్లాక్ ఫంగస్ వచ్చినట్లు తెలుపుతూ కావిడ్ పరీక్షలను ఓపెన్ ప్లేసులో నిర్వహించాలని కాలనివాసులు కోరారు.

—————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయంచే జారీ చేయడమైనది.

Share This Post