31 – హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తాం : ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ ఓం ప్రకాష్

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలు

జనరల్ అబ్జర్వర్ డాక్టర్ ఓం ప్రకాష్

00000

31 – హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామని ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ ఓం ప్రకాష్ ఐ.ఏ.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 న జరుగనున్న
31- హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు సోమవారం హుజురాబాద్ లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం, హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తో ఎన్నికల సరళి పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేశారు. 31 – హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఎన్నికల పోటీలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికలలో చేసే ఖర్చులపై నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోబపెట్టేలా పోటీలొ ఉన్న అభ్యర్థులు పంపిణీ చేసేడబ్బు, మద్యం, బహుమతుల పై దృష్టి సారిస్తామని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, తనిఖీ పకడ్బందీగా చేస్తున్నారా లేదా అనే విషయాల పై గట్టి నిఘా ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు పెట్టే ఖర్చుల వివరలను ఎక్స్ పెండీచర్ బృందాలు ప్రతి రోజు నమోదు చేయాలని, వీటి పై గట్టి నిఘా పెట్టాలని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నివేదికను ఎన్నికల సంఘానికి నివేదిస్తామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. తాను కరీంనగర్ లోని ఎక్సైజ్ భవన్ అతిథి గృహములో బస చేశానని, 31 – హుజురాబాద్ శాసన సభ ఉప ఎన్నిక పూర్తి అయ్యే వరకు ఇక్కడే ఉంటానని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై ఉల్లంఘన జరిగినట్లు తెలిసిన వారు ఎవరైన తనకు 6281552166 సెల్ నెంబర్ కు సమాచారం అందించాలని, ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు తనను కరీంనగర్లోని ఎక్సైజ్ భవన్ అతిథి గృహములో కలువవచ్చునని, సాధారణ ఎన్నికల పరిశీలకుడు డాక్టర్ ఓం ప్రకాష్ ఆ ప్రకటనలో తెలిపారు.

Share This Post