స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్ధం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మహబూబాబాద్, ఆగస్ట్-15:

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పోలీసు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు, సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. కొమురయ్య, అసిస్టెంట్ కలెక్టర్ అభిషెక్ అగస్త్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకట రమణ, జిల్లా అధికారులు సిపిఓ-సుబ్బారావు, సివిల్ సప్లై అధికారి నర్సింగరావు, జిల్లా అధికారి ఛత్రు నాయక్, సర్వే, ల్యాండ్స్-ఏడి నర్సింహామూర్తి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు డి. అశోక్, ఉ.పున్నం చందర్, పి.అనురాధ, సీనియర్ అసిస్టెంట్ లు జి. అనురాధ, ఎండి.ఫిరోజ్ పాషా, ఇతర కార్యాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయం చే జారీచేయనైనది.

Share This Post