ప్రచురణార్ధం

ఆగష్టు 15 ఖమ్మం: –

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం ఖమ్మం నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాల్స్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీసు కమిషనర్ విష్ణు. యస్. వారియర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయా స్టాల్స్న మంత్రి సందర్శించారు. జిల్లా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్.టి.సి. మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యశాఖ, అటవీ శాఖ, భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖ, ఎస్సీ కార్పొరేషన్, స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్.డబ్ల్యూఎస్, పౌర సరఫరాల శాఖ, విద్యాశాఖ, మెప్మా, బి.సి.కార్పోరేషన్, మైనారిటీ కార్పోరేషన్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారి వికలాంగులకు త్రిచక్రవాహనాలను, వినికిడి పరికరాలు, ముస్లిం మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను, కులాంతర వావాహ ప్రోత్సాహకాల క్రింద నలుగురు జంటలకు ఒక్కొక్కరికి రెండున్నర లక్షల చొప్పున 10 లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. అదేవిధంగా 103 మంది వీధి వ్యాపారులకు 20 లక్షల ఋణాల చెక్కులను మంత్రి అందజేశారు.

నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, జిల్లా రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు, సురా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి లక్ష్మీప్రసన్న, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యావందన, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.

 

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post