అర్జీలను వెంటనే పరిష్కరించాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్ధం

అర్జీలను వెంటనే పరిష్కరించాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మహబూబాబాద్, ఆగస్ట్-16:

గ్రీవెన్స్ అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష  అభినవ్ అధికారులను ఆదేశించారు.

సోమవారం  కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను  స్వీకరించారు. అధికారులు తమకు వచ్చిన దరఖాస్తులను భౌతికంగా తీసుకొని సమస్య పరిష్కార పరిస్థితిని grievance portal లో నమోదు చేయడం లేదని, దరఖాస్తుపై తీసుకున్న చర్యలు, పరిష్కార వివరాలను పోర్టల్ లో నమోదు చేయాలని, సమస్య పరిష్కారం అయినా కూడా గ్రీవెన్స్ పోర్టల్ లో సమస్య పెండింగ్ లో ఉన్నట్లు చూపుతోందని, అధికారులు వెంటనే అప్డేట్ చేయాలని సూచించారు.

నర్సింహులపేట మండలం  నరసింహాపురం బంజర గ్రామానికి చెందిన గుగులోతు అనిత బ్యాటరీ ట్రై సైకిల్ మంజూరు చేయాలని కోరారు. దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామం నివాసి జాటోత్ రమేష్ గత మూడు సంవత్సరాలుగా మహబూబాబాదులో నివాసం ఉంటున్నాను అని, తను నిరుపేద కుటుంబానికి చెందిన వాడినని,  తన కుమారుడు శివకుమార్ ఐదో తరగతి ఉత్తీర్ణత అయినందున కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం కల్పించవలసిందిగా కోరారు.

పెద్ద వంగర మండలం బంగారు చెలిమ తండ గ్రామ సర్పంచ్ పద్మ, ఉప సర్పంచి శంకర్ద దరఖాస్తు సమర్పిస్తూ, 2008లో ఉమ్మడి గ్రామపంచాయతీ చిన్న వంగర బంగారు చెలిన తండా తరఫున రేషన్ షాప్ నెంబరు 3115018 ST కోటాలో ప్రవీణ్ కుమార్ కు మంజూరైందని, ఈ రేషన్ షాప్ పరిధిలో 252 కార్డులను 250 కార్డులు ST మెజారిటీ కు చెందినవని, 2014 లో సదరు ప్రవీణ్ కుమార్ కు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందున షాప్ ను మరొకరికి అప్పజెప్పి వెళ్ళడం జరిగిందని, ప్రస్తుతం oc జనరల్ గా చూపుతూ చిన వంగర కు ఈ షాప్ ను మార్చి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది, చిన వంగర కు  సుమారు 8 కిలోమీటర్ లు వృద్దులు, గ్రామస్తులు ప్రయాణం చేసి రేషన్ తీసుకొని రావాల్సి ఉంటుందని, ఈ సమస్యను  అర్థం చేసుకొని ఎక్కువగా ST జనాభా ఉన్నందున బంగారు చెలిమా తండాకు మార్చి ST వారికి మంజూరు చేయాలని కోరారు.

స్థానిక గోపాలపురం కాలనికి చెందిన మొగిలిచర్ల పరందామయ్య శివారులో గల సర్వే నెంబర్ 553/ఈ/4/1 లో తనకు 4 ఎకరాల 28 గుంటల భూమి ఉన్నదని, 1988 లో రిజిస్ట్రేషన్ చేయించానని, సుమారు 4 నెలల క్రితం 20 గుంటల భూమి అమ్మడానికి వెళ్ళగా ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నదని స్టాట్ బుక్ కావడం లేదని తెలుపుతూ గతంలో ఉన్న జిల్లా కలెక్టర్ కు ధరఖాస్తు సమర్పించానని,  ప్రొహిబిటెడ్ జాబితా నుండి భూమిని తొలగించాలని ధరఖాస్తు సమర్పించారు.

కూలీ పని చేసేటప్పుడు ప్రమాదవశాత్తు చేతి 3 వ్రేళ్ళు తెగిపోయినందున, బీద కుటుంబానికి చెంది ఎటువంటి జీవనోపాథి లేనందున సదరం సర్టిఫికేట్ ఇప్పించాలని మరిపెడ బంగ్లా మండలం గాలివారిగూడెం కు చెందిన బండి సువార్తా దరఖాస్తు సమర్పించారు.

అనంతర్ం జిల్లా కలెక్టర్ వివిధ శాఖలలో పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులపై సమీక్షించారు.  కోర్టు కేసులపై తీసుకున్న చర్యలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు.  తమ శాఖలో పెండింగ్ లో ఉన్న కేసులు వెంటనే పరిష్కారం పొందేలా చర్యలు చేపట్టి నివేదికలు సమర్పించాలని తెలిపారు.  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రసంశా పత్రాలను అందించారు.  స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలలో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో మొదటి బహుమతి పొందిన డి.ఆర్. డి.ఓ కు ఐదు వేల రూపాయలు, రెండవ బహుమతి పొందిన డిపిఓ కు మూడు వేల రూపాయలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.కొమరయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఎ.ఓ. వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు
—————————————————————————————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్  కార్యాలయం చే జారీ చేయనైనది.

Share This Post