మాతృ మరణాలు నివారించాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్థం

మాతృ మరణాలు నివారించాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మహబూబాబాద్, ఆగస్టు-19:

జిల్లాలో మాతృ మరణాలను నివారించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంభందిత అధికారులను ఆదేశించారు. డెలివరీ సమయంలో వివిధ కారణాలతో చనిపోతున్న గర్భవతులను సంరక్షించి మాతృ మరణాల రహిత జిల్లా గా ఏర్పాటు చేయుటకు మనస్ఫూర్తిగా వైద్యులు కృషి చెయ్యాలని, గర్భవతులకు సరైన సమయంలో వైద్యాన్ని అందించాలని కలెక్టర్ అన్నారు.

గురువారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో మూడు నెలలకోసారి నిర్వహించే మాతృ మరణాల నివారణ కమిటీ సమీక్ష సమావేశంలో వివిధ కారణాలతో మృతి చెందిన వారి వివరాలను, కారణాలు , ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారులతో జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు చేస్తూ, సరైన సమయంలో వైద్యం అందిస్తూ తీసుకోవాల్సిన పోషకాహారం పై గర్భవతుల వద్దకే వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని, ఒక ప్రాణానికి ప్రాణం పొసే క్రమంలో వైద్యులు తోడు గా ఉండాలని సృష్టి కి కరణమవుతున్న మాతృ మూర్తిని మనం కాపాడుకోవాలని తెలిపారు. పెసెంట్స్ పరిస్థితి ముందస్తుగానే గుర్తించి వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల నుండి వాగ్మూలం, సంతకం తీసుకోవాలని,అట్టి వీడియో, ఫోటో లను జాతపర్చాలని ఆదేశించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు జరిగేట్టు వైద్యులు కృషి చెయ్యాలని,మాతృ మరణాలని నివారించాలని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి హరీష్ రాజ్, ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ వెంకట్ రాములు, మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రాం అధికారిని బిందు శ్రీ, డిప్యూటీ డి ఎం హెచ్ వో లు మురళి అంబరీష్ లు జిల్లా ఎక్స్టెన్షన్ మీడియా అధికారి ప్రసాద్, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

———————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయం చే జారీ చేయనైనది.

Share This Post