ప్రెస్ రిలీజ్.
తేది.27.8.2021.
హనుమకొండ జిల్లా.
భిమదేవరపల్లి మండలం.

భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు ఒక కీర్తి శిఖరం అని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు.

శుక్రవారం నాడు భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు స్వగ్రామం అయిన వంగర గ్రామంలో పీవి నరసింహ రావు విజ్ఞాన వేదిక, పివి మ్యూజియంలకు ఘనంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యాక్రమానికి పంచాయతీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు,రాజ్యసభ సభ్యులు,
కెప్టెన్ లక్ష్మీ కాంతారావు, పీవీ కుమార్తె, ఎంఎల్సి సురభి వాణిదేవి,హుస్నాబాద్ శాసనసభ సభ్యులు సతీష్ కుమార్, పివి కుమారుడు ప్రభాకర్ రావు, పీవీ కుటుంబ సభ్యులు, ప్రజలు భారీగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ పీవీ నరసింహారావు దేశ ప్రతిష్ట ను ఇనుమడింప చేసిన మహోన్నత వ్యక్తి అని ప్రపంచం అబ్బురపడేలా దేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన మహనీయుడు ఆని ఆన్నారు.
పీవీ నరసింహారావు వ్యక్తులకు కాకుండా వ్యవస్థలను, సమాజాన్ని మేలు కోరి పని చేశారని అన్నారు. గత ప్రభుత్వాలు పీవీ నరసింహారావు ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పివీ దేశానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నదని అన్నారు. రాజకీయాలలో తనను ఎంతో ప్రోత్సహించేవారని ఆయన తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మహిళలు ఆర్దికంగా బలపడాలని, వారికోసం ఎన్ని నిధులు అయినా ప్రభుత్వం ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. గ్రామంలో ని మహిళలు స్వయంగా ఎదగడానికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని, గ్రామాల్లో ఉన్న వనరులను వినియేగించుకోవాలని ఆయన సూచించారు.

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, దక్షిణ భారతదేశం నుంచి తొలి ప్రధానమంత్రి అయ్యి మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు సమర్దవంతంగా పరిపాలించిన గొప్ప వ్యక్తి పీవీ అన్నారు.
పీవీ నడయాడిన వంగర లో ఆయన స్మృతి వనంను నిర్మిస్తున్న మని అన్నారు. పీవీ ఎంత ఎత్తుకు ఎదిగిన సొంత గ్రామం వంగరతో ఎనలేని బంధం ఉందని, ఆయన జ్ఞాపకాలను పదిలపరిచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ స్మృతి వనాన్ని నాలుగు న్నర ఎకరాల్లో ఏడు కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో నిర్మిస్తామని, సంవత్సరం లోపు పూర్తి చేస్తామని ఆయన అన్నారు. వంగర గ్రామాన్ని టూరిజం పరంగానూ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. నెక్లెస్ రోడ్ కి పీవీ మార్గ్ అని పేరు పెట్టడం జరిగిందని అన్నారు. పేదలకు స్వయంగా తన భూమిని పంచిపెట్టిన మహనీయులు పీవీ అని ఆయన అన్నారు.

పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కే. కేశవరావు మాట్లాడుతూ.. రాష్ట్రంతో పాటు దేశ‌, విదేశాల్లో పీవీ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాం అని ఆయన అన్నారు. పీవీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని గ‌తేడాది సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారని ఆయన అన్నారు. ఈ ఏడాది కాలం పాటు ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నమని ఆయన అన్నారు. ఆయన ఆధునిక భారత్ కు పునాదులు వేసిన రాజనీతిజ్ఞుడు అని, ప్రతి రంగం పై తనదైన ముద్ర వేసిన తెలంగాణ బిడ్డ పివి అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పీవి పేరుతో అనేక కార్యాక్రమాలను చేపట్టిందని ఆయన చరిత్ర కలకాలం నిలిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి మాట్లాడుతూ పీవీ సంతానం అంతా ఈ గ్రామంలో నే పుట్టారని,తాను ఇక్కడ గీసిన వాటర్ పేయింటింగ్స్ వాషింగ్టన్ లో ప్రదర్శించారని అన్నారు. ఎర్రకోటపై తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తెలుగు వ్యక్తి పివి అని ఆమె అన్నారు. మహిళలు స్వయంగా ఎదగాలనే లక్ష్యం తో మహిళా సంఘాలు కు చెక్కులను ఈ సందర్భంగా పంపిణీ చేయడం పంపిణీ శుభసూచికం అని అన్నారు.

అనంతరం మంత్రులు భిమాదేవరపల్లి మండలంలోని స్వయం సహాయక సంఘాలకు 18 కోట్ల 8 లక్షల విలువ గల చెక్కులు, ఎల్కతుర్తి మండల మహిళా సంఘాలకు 16 కోట్ల 36 లక్షల వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ, స్ర్తినిధి రుణాల చెక్కులు పంపిణీ చేశారు. దీనితోపాటు భిమాదేవరపల్లి, ఎల్కతుర్తి మండలం లబ్దిదారులకు కూడా కళ్యాణ లక్ష్మీ చెక్కుల ను పంపిణీ చేశారు. అనంతరం మంత్రులు పివి స్వగృహంలో నిర్మించిన పివి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, టూరిజం ఎండి మనోహర్, డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, డిఆర్ఓ వాసు చంద్ర, డిపిఓ జగదీశ్వర్, భీమదేవరపల్లి జడ్పిటిసి రవి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి ఎంపీపీలు జక్కుల అనిత, మేకల స్వప్న , భీమదేవరపల్లి ఎల్కతుర్తి తహసీల్దార్లు ఉమా దేవి, రవీందర్ రెడ్డి, భీమదేవరపల్లి ఎంపీడీవో భాస్కర్, వంగర సర్పంచ్ రజిత గోపాల్ రెడ్డి,ఎల్కతుర్తి పిఎస్ సిఎస్ చైర్మన్ రవీందర్, లేబర్ ఫెడరేషన్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post