18 సం. నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

18 సం. నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం —2

తేదీ.16.9.2021

18 సం. నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల, సెప్టెంబర్ 16 :- జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేసే దిశగా అవసరమైన చర్యలు పకడ్భందిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పై జిల్లా కలెక్టర్ గురువారం సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ మరియు టెలికాన్పరెన్సులు నిర్వహించారు. ప్రతి ప్రాథమిక ఆరొగ్య కేంద్ర పరిదిలో వ్యాక్సినేషన్ వేయించడానకి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో మొత్తం గ్రామీణ ప్రాంత పరిదిలో 140 సబ్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. పట్టణ ప్రాంతంలో ఉన్న 134 వార్డులలో 134 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ అధికారులకు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు పి.హెచ్.సి సబ్ సెంటర్లలో వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రంలో ప్రతిరోజు కనీసం 100 మందికి కోవిడ్ టీకా అందించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న 274 వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రోజుకి 27400 టీకాలకు తక్కువ కాకుండా వేయాలని, వ్యాక్సిన్ కోసం వచ్చే వారు తప్పకుండా వారి వెంట సెల్ ఫోన్ మరియు ఆధార్ కార్డ్ తీసుకొని రావాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో స్థానిక సంస్థల, వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి టీకాలు వేయించుకొని వారిని గుర్తించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా వారికి వ్యాక్సిన్ వేయించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని 140 సబ్ సెంటర్ల పరిధిలో ఉండే 380 గ్రామాలు, 39 ఆవాసాలలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అందించాలని, 100% పూర్తి చేసిన ఇంటికి వ్యాక్సినేషన్ పూర్తైనట్లు వారి ఇంటికి స్టిక్కర్లు అంటించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి సబ్ సెంటర్ పరిధిలో ఉండే గ్రామాలో వ్యాక్సినేషన్ ప్రారంభించాలని, సదరు గ్రామంలో పట్టణాల్లో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని,ప్రత్యేక డ్రైవ్ కాలంలో పట్టణ ప్రాంత పరిధిలో 11 హెల్త్ సెంటర్లలో మాత్రమే వ్యాక్సినేషన్ నిర్వహించబడదని కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలలో మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలని ఈ కేంద్రాలను ప్రజలు వినియోగించుకునే విధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు సహకారం తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు మండల పరిధిలో జరిగిన వ్యాక్సినేషన్ వివరాలకు సంబంధించిన నివేదికలను ఎంపిడిఒ, వైద్యాధికారి సమన్వయంతో అందించాలని, మండల ప్రత్యేక్ష అధికారులు గ్రామాల్లో పర్యటించినప్పుడు మొక్కలకు ఏర్పాటు చేసిన ట్రీగార్డులు సక్రమంగా ఉండేవిదంగా పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లా వైద్యరొగ్యశాఖ అధికారి, సంబంధిత మండల ప్రత్యేక అధికారులు తదితరులు ఈ కాన్పరెన్సులో పాల్గోన్నారు.

 

Share This Post