జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లి కోర్ట్ (పొక్సో కోర్ట్) భవనాన్నిపరిశీలించిన తెలంగాణ హైకోర్టు పోర్ట్ ఫోలియో జడ్జ్ జస్టిస్ పి. నవీన్ రావు

జనగామ, సెప్టెంబర్ 17: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లి కోర్ట్ (పొక్సో కోర్ట్) భవనాన్ని తెలంగాణ హైకోర్టు పోర్ట్ ఫోలియో జడ్జ్ జస్టిస్ పి. నవీన్ రావు శుక్రవారం పరిశీలించారు. పోస్కో కోర్ట్ లో ఏర్పాటు చేసిన అధికారి గది, కోర్టు హాల్, నిందితుడి ప్రవేశ ద్వారం, లోపల పిల్లల కొరకు చేసిన పెయింటింగ్ అన్నిటిని కలియ తిరుగుతూ పరిశీలించారు. ఇంకనూ ఏమైనా మిగులు పనులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కోర్టు లోపల క్వార్టర్స్ ను పరిశీలించారు. కోర్టులోని భవనాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోస్కో కోర్టులో ఏర్పాట్లపై ఆయన సూచనలు చేశారు. రూ. 12 లక్షలతో భవన సివిల్ పనులు, రూ. 10 లక్షలతో ఫర్నీచర్, వుడ్, పెయింటింగ్ పనులు చేపట్టారు.
అంతకుముందు జిల్లా పర్యటనకు వచ్చిన జస్టిస్ పి. నవీన్ రావు కు ఆర్ అండ్ బి వసతిగృహం వద్ద జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం తో స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనాన్ని హైకోర్టు పోర్ట్ ఫోలియో జడ్జ్ స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు జిల్లా జడ్జ్ జస్టిస్ కవిత, సీనియర్ సివిల్ జడ్జ్ జస్టిస్ కాంచనా రెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జస్టిస్ అజయ్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ పృద్వీరాజ్, డిసిపి బి. శ్రీనివాస రెడ్డి, ఆదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, బార్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు తదితరులు ఉన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post