గణేశ నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం రోజున వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దిశ నిర్దేశం మేరకు వినాయక నిమజ్జనాన్ని విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య  ఒక ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు. ఈ  నిమజ్జనానికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో  నిమజ్జనాన్ని జరుపుకోవాల్సిన దిగా జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు  .ఈ  మధ్య కురిసిన   అధికవర్షాల వలన జిల్లాలోని అన్ని వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని, చెరువులు, రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండి ఉన్నందున  జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం లో మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎస్ఐ, మండల ప్రత్యేక అధికారులు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో నిమజ్జనానికి అన్ని  ఏర్పాట్లు చేశామని కలెక్టర్  అన్నారు.జిల్లా రెవెన్యూ మరియు పోలీసు యంత్రాంగానికి సంబంధిత గణేష్ మండళ్ల అసోసియేషన్ మెంబెర్స్, ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ అన్నారు.

 

Share This Post