4వ విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం లో భాగంగా పెబ్బేరు మండలం కంబల్లాపురం, షేర్ పల్లి, రంగాపురం గ్రామాల్లో తనిఖీ : వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష

పత్రికా పకటన. తేది:5.7. 2021
వనపర్తి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 7వ. విడత హరితహారం, 4వ విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు పురోగతి సాధించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష తెలిపారు.
సోమవారం వనపర్తి జిల్లా పరిధిలోని పెబ్బేరు మండలం కంబల్లాపురం, షేర్ పల్లి, రంగాపురం గ్రామం లో పెబ్బేరు మున్సిపాలిటీలో జరిగిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై నర్సరీలు తనిఖీ చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టి గ్రామాలను అందంగా తీర్చిదిద్దాలని ఆమె అన్నారు. జిల్లాలో 27 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసి మొక్కలు నాటినట్లు, ఇంకా 5 రోజులలో మిగతావి పూర్తి చేయాల్సి వుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేస్తారని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని జిల్లా కలెక్టర్ గ్రామ ప్రజలకు సూచించారు. జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటుతున్నట్లు, జిల్లా వ్యాప్తంగా 40 కిలోమీటర్ల రహదారుల పొడవు, 60 వేల మొక్కలు నాటుతున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. గ్రామాలలో మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ పనులు నిర్వహిస్తూ, ఎక్కడ ఏ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. ఏడో విడత హరితహారం కార్యక్రమం గ్రామాలలో విజయవంతంగా నడుస్తున్నదని, ప్రతి ఒక్కరు మొక్కలను నాటి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పెబ్బేరు ఐదవ వార్డులో నర్సరీని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కానుగ, ఉసిరి, పెలోపా మ్, రెయిన్ ట్రీ, కుంకుడు, చైనా బాదం, టే కోమా, పుల మొక్కలు నాటాలని అధికారులకు ఆమె సూచించారు.
ముందుగా కంబళ్ళాపురం బస్టాండ్ అవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. శేరుపల్లి గ్రామ పంచాయతీలో డి.ఆర్. డి. ఓ. నర్సింహులు, ఏ.పి. డి, కృష్ణయ్య, ఎం.పి.డి. ఓ.ప్రసన్న కుమార్ తో కలిసి చెత్త సేకరణ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. అనంతరం పెబ్బేరు మునిసిపాలటీలో రోడ్డుకు ఇరు వైపులా అధికారులతో కలిసి మూడు వరుసల్లో మొక్కలు నాటారు. రంగాపురం హైవే పై జిల్లా కలెక్టర్ చెట్లు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె అధికారులకు సూచించారు. తద్వారా గ్రామాభవృద్ధి సాధ్యమని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం.పీ.పీ. శైలజా, కురుమూర్తి, సర్పంచ్ గట్టయ్య, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, నరసింహ స్వామి ,కర్రెస్వామి, ఎం.పీ.డీ.వో. ప్రవీణ్ కుమార్, కమీషనర్ జాన్ కృప సాగర్, రమేష్ నాయుడు, అధికారులు, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.
………………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి నుండి జారీ చేయడమైనది.

Share This Post