4 లక్షల విలువైన ఆసుపత్రి సామగ్రిని కలెక్టర్ కు అందజేసిన ప్యూర్ …

ప్రచురణార్ధం

4 లక్షల విలువైన ఆసుపత్రి సామగ్రిని కలెక్టర్ కు అందజేసిన ప్యూర్ …

మహబూబాబాద్,అక్టోబర్,29.

వైద్యులకు కావాల్సిన కోవిడ్ సామాగ్రిని ప్యూర్ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ శశాంక కు శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.

రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామచంద్రు నాయక్ పిలుపు మేరకు ప్యూర్ సంస్థ ప్రతినిధులు వినీల్ రెడ్డి 4 లక్షల రూపాయల విలువైన పిపి కిట్స్ గౌన్స్, సేఫ్టీ గోగల్స్, ఫీ షీల్డ్స్ , సర్జికల్ మాస్క్ లు, ఎన్ 95 మాస్క్ లు, నిబులైజర్, వంటి సామాగ్రిని కలెక్టర్ చేతుల మీదుగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు బాణోత్ వెంకట రాములుకు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వామ్యం కు దాతలు ముందుకు రావాలని కోరారు.

దాత వినీల్ రెడ్డిని కలెక్టర్ శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి పి.వి.ప్రసాద్, డాక్టర్ వైదేహి కిరణ్ కుమార్ యాదవ్, ఎస్.మహేందర్ రెడ్డి , శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
—————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post