కోమ్మనపల్లి తండా గ్రామపంచాయతీ నూతన భవనమును ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ప్రచురణార్థం
తొర్రూర్ / మహబూబాబాద్ 26 సెప్టెంబర్-2021.

స్వరాష్ట్ర పాలనలో తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలనతో వినూత్న సంక్షేమ,అభివృద్ధి ఫలాలు అందిస్తున్న ప్రభుత్వాన్నీకి మనం రుణపడి ఉన్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్,ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆర్ జి ఎస్ ఏ నిధులు 20లక్షల వేయం తో కోమ్మనపల్లి తండా గ్రామపంచాయతీ నూతన భవనం మంత్రి , జిల్లా కలెక్టర్ శశాంక తో కలిసి ప్రారంభించారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం పని చేస్తుందని, నూతన గ్రామపంచాయతీ భవనాలు, నిర్మాణాలు, సిసి రోడ్లు బిటి రోడ్లతో తండాలకు సులభమైన ప్రయాణం , మొదలగు నిర్మాణాలతో నూతన వైభవం వచ్చిందని, ఆసరా ,కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ ,మిషన్ భగీరథ త్రాగునీరు, వినూత్నమైన పథకాలతో పొరుగు రాష్ట్రాలకు ఆదర్శవంత మని, గర్వించదగ్గ విషయమని అన్నారు. గ్రామపంచాయతీ నిధులను గ్రామ సభల్లో ముందస్తు ప్రణాళికలతో ఖర్చు చేసుకోవాలని సూచించారు.

రైతు పక్షపాతిగా ప్రభుత్వం పనిచేస్తుందని పంట వేసిన అప్పటినుండి అమ్మే వరకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, ఆయిల్ ఫామ్ సాగుతో రై రైతులు మరింత అభివృద్ధి చెందవచ్చు అన్నారు, కరోనా మహమ్మారి వల్ల అభివృద్ధి పనులు వెనకబడి పోయాయని త్వరలోనే 5 కోట్లతో చింతలపల్లి నుండి సన్నూర్ వెళ్లే డబల్ రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.

జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు గిద్దె రాంనర్సయ్య, రంజిత్, భిక్షపతి, యుగేందర్, నరేష్ కవిత లు పలుసంక్షేమ అభివృద్ధి పథకాల పై కళారూపాల ద్వారా ప్రజలను, అధికారులను ఉత్తేజపరుస్తూ చైతన్యం చేశారు. గ్రామ పంచాయతీ భవనాలు అధునాతన సౌకర్యాలతో నిర్మించుకోవడం హర్షించదగ్గ విషయమని తండాలు గ్రామ పంచాయతీలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని మంత్రి అన్నారు.
గ్రామ పంచాయతీలు ఆరు మంజూరు కాగా మూడు పూర్తయ్యాయని మూడు వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, సీఈవో రమాదేవి, డి పి ఓ రఘువరన్, ఆర్డిఓ రమేష్, పంచాయతీరాజ్ ఈ ప్రసన్నకుమార్, తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో భారతి, ఎం పి పి చిన్న అంజయ్య, జడ్పిటిసి, శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు,మిషన్ భగీరథ డీఈ శ్రీనివాస్, APM వరదయ్య, పంచాయితీ కార్యదర్శి లెనిన్ , గ్రామ సర్పంచ్ పాడ్య రమేష్, అధికారులు ప్రజా ప్రతినిధులు తండావాసులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————————-
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం మహబూబాబాద్ గారిచే జారీ చేయడమైనది

Share This Post