వార్త ప్రచురణ:
తేదీ.02.10.2021.
ములుగు జిల్లా.

జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు డియర్వో రమాదేవి గారు జిల్లా కలెక్టరేట్ లో మరియు జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయం లో మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకుని గాంధీ గారి చిత్ర పటానికి పూమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్రోద్యమంలో గాంధీ గారి సేవలను కొనియాడారు. భావితరాలు బాపూజీ యొక్క విధానాలను పాటించి దేశభక్తిని పెంచుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధ్వర్యంలో సాంస్కృతిక కళా కారులు మహాత్మా గాంధీ గారి సేవలను గుర్తుకు చేస్తూ పాటలు పాడారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డీవో నాగ పద్మజ, డి పి ఆర్ ఓ. ప్రేమలత,
ఏ ఓ.శ్యామ్, మరియు కలెక్టరేట్ కార్యాలయ అధికారులు మరియు ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సంస్కృత కళా కారులు పాల్గొన్నారు.

Share This Post