వార్త ప్రచురణ
తేదీ.02.10.2021.
ములుగు జిల్లా.

జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు శనివారం రోజున
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధ్వర్యంలో స్వచ్చత హే సేవా రథాన్ని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.

75 వ ఆజాద్ కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛ తా హే సేవా ప్రచార రథాన్ని ఆర్డిఓ మరియు అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ ) నాగ పద్మజ, డిఆర్ఓ రమాదేవి గార్ల చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు.

డిఆర్డిఓ మరియు ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) నాగ పద్మజ మాట్లాడుతూ ఈ రథ యాత్ర లో మరుగు దొడ్ల వాడకం, తడిపొడి చెత్త నిర్వహణ, నిర్వహణ, ద్రవ పదార్థాల నిర్వహణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన, ఇంకుడు గుంతల నిర్మాణం మొదలగు అంశాల గురించి స్వచ్ఛత గీతాలతో అవగాహన కల్పించడం జరుగుతుందని, అలాగే జిల్లాలోని అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించడం జరిగిందని వారు అన్నారు.

అనంతరం డిఆర్ఓరమాదేవి మాట్లాడుతూ గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని అన్నారు.
అనంతరం విజయ్ సాంస్కృతిక సారథి బృందం కళాకారులచే పర్యవరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత పై ఆట పాట నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిపి ఓ వెంకయ్య,  డి డబ్క్యు ఓ ప్రేమలత
ఏఓ శ్యామ్, ఎస్ బి ఎమ్ కోఆర్డినేటర్ మై మున్నీసా తదితరులు పాల్గొన్నారు.

Share This Post