చోల్లేటి  శ్రవణ్ కుమార్, ఉమ్మడి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ,నల్లగొండ సంయుక్త ఆధ్వర్యంలో లా ఫర్ హ్యూమానిటి అనే అంశంపై వక్తృత్వ పోటీ న్యాయవాదులకు నిర్వహించారు. ఈ కార్యక్రమములో న్యాయ వాదులు పాల్గొనగా జి. జవహర్లాల్, ఎ. ఆదిరెడ్డి
ఎన్. భీమార్జున రెడ్డి  నాయవాదులు పోటీలో గెలుపొందారు. కార్యక్రమములో ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అద్యక్షులు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యం. వి. రమేష్ మాట్లాడుతూ
ఇలాంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తికి నైపుణ్యత పెంచుతాయని భారత రాజ్యాంగము ఆన్ని చట్టాలకు మాత్రుకని, ప్రాథమిక హక్కులు అన్నీ హ్యుమానిటికి క్రిందకు వస్తాయని , మానవ సామాజం మెరుగుపడాలంటే మానవత్వం పెంపొందాలని తెలిపారు. అదనపు జిల్లా న్యాయమూర్తి యం. భవాని మాట్లాడుతూ ఆర్టికల్ 39 ద్వారా న్యాయ సేవ అధికార సంస్ధ చట్టం సమ న్యాయం సత్వర న్యాయం నినాదముతో సామాన్యులకు న్యాయ సేవలు చేరువ అవుతున్నాయని తెలిపారు. జిల్లా న్యాయ సేవ అదికార సంస్ధ కార్యదర్శి జి. వేణు మాట్లాడుతూ న్యాయ సేవల అవగాహన కార్యక్రమములో బాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమైనది తెలిపారు.
నల్లగొండ న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు మేడ మోహన్ రెడ్డి మరియు కార్యదర్శి ఎ.వెంకట్ రెడ్డిలు మాట్లడుతూ మానవత్వం వర్దిల్లినప్పుడే
మానవ నాగరిక సమాజం వర్ధిల్లుతుంది అని తెలిపారు. కార్యక్రమములో చొల్లేటి శ్రవణ్ కుమార్ ఫౌండేషన్ చైర్మన్ , రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ చోల్లెటి ప్రభాకర్ మాట్లాడుతూ రాజ్యాంగములొ పొందుపరచిన ప్రాథమిక హక్కులు
మానవ హక్కులను , మానవత్వాన్ని  పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమములో  న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గోన్నారు.

Share This Post