వార్త ప్రచురణ
తేదీ.08.10.2021.
ములుగు జిల్లా.

జిల్లా ఎస్సి .ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం రోజున కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ కి జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య గారి అధ్యక్షతన నిల్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బండారుపల్లి లో నిర్మించిన గిరిజన భవనం ఒక కోటి నలభై లక్షలతో నిర్మించడం జరిగిందని, అందులో ఇండోర్ గేమ్ షటిల్ కోర్టు నిర్వహించడం జరుగుతుందాని వారి అన్నారు.అలాగే బండారు పల్లి లో ఆరు ఎకరాల స్థలంలో ఆడిటోరియం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వారు అన్నారు. ములుగు లో నిరుపయోగంగా ఉన్న అంబేద్కర్ భవనాన్ని వెంటనే పునరుద్ధరించి సంబంధిత అధికారులకు అప్పగించాలి అని కలెక్టర్ అన్నారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని, గతంలో దళితులకు పంపిణీ చేసిన మూడు ఎకరాల భూమి లో నీటి వసతి లేక బీడు భూములుగా మారాయని వాటికి నీటి వసతి కల్పించు టకు ఎస్సీ కార్పొరేషన్ ఇడి రవి గారిని ఆదేశించారు.

జిల్లా లో గత సంవత్సరం జరిగిన రివ్యూ లో లేవనెత్తిన అంశాల పైన మరియు కొత్తగా జిల్లాలో పెండింగ్ కేసులు మరియు సమస్యల 75 పైన చర్చ జరిగింది. వీటిలో ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలు, మరియు ఎస్సీలకు 3 ఎకరాల భూమి పంపిణీలో పట్టాలు లేని వాటిని గుర్తించి వాటికి పట్టాలు ఇప్పించే ఏర్పాటు చేస్తానని జిల్లా కలెక్టర్ అన్నారు.జిల్లాలోని అసైన్డ్ భూముల పైన సర్వే చేయించుటకు డిఆర్వో రమాదేవి ని అదేశించారు.జిల్లాలో అంబేడ్కర్ కమ్యూనిటీ హాలు లు 11 మంజూరు కాగా, వాటి నిర్మాణానికి స్థల పరిశీలనకు సంబంధిత మండలాల తహసీల్దార్ నివేదికలు పంపుటకు సంబంధిత అధికారులకు ఆదేశించారు.

ఏటూరు నాగారం మండలంలో anm పోస్టులలో మెరిట్ ప్రకారం కాకుండా ఎస్సీ మహిళకు జరిగిన అన్యాయం గురించి పరిశీలిస్తాని జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులకు సూచించడం జరిగింది. పోలీసు స్టేషన్ పరిధిలో ఏదైనా ఎస్సీ., ఎస్టీ., ల ధరకాస్తు లు వచ్చినట్లు అయితే పరిశీలించి త్వరిత గతిన కేసులు బుక్ చేయాలని, లేని పక్షంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కేసు విత్ డ్రా అవుతుందని కమిటీ సభ్యులు సుకుమార్ అన్నారు.
ఈ సందర్భంగా ములుగు జిల్లా ఏ ఎస్పీ సాయి చైతన్య మాట్లాడుతూ నిబంధనల మేరకు పరిశీలించి సదరు వ్యక్తి కి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని వారు అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాట్స్ అప్ గ్రూప్ ద్వారా తెలియచేయాలని కమిటీ సభ్యులకు సూచించడం జరుగుతుంది.ఆర్టీసి బస్టాండ్ పక్కన ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించిన ప్రభుత్వ షట్టర్ నీ బినామీలు వాడుకుంటున్నట్లుగా కలెక్టర్ గారి దృష్టికి కమిటీ సభ్యులు చుంచు రవి తీసుకు రాగా వాటిని పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని ఎస్సీ, ఎస్టీ లకి ఏదైనా సమస్యలు ఉన్నట్లు అయితే తన దృష్టికి తీసుకు రావాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ములుగు ఏ ఎస్పీ సాయి చైతన్య, డీఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య ,. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ది అధికారి భాగ్యలక్ష్మి , డి పిఓ వెంకయ్య, జిల్లా ఎస్సీ. ఎస్టీ. కమిటీ సభ్యులు నక్క బిక్షపతి,జన్ను రవి, మహేష్ నాయక్,సామ్రాజ్యం ఎన్జీఓ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post