జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రణాళికబద్దంగా శీర్ రోజుల్లో 100 శాతం పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్రెడ్దితో కలిసి మాట్లాడారు. రానున్న నలభై ఐదు రోజుల్లో జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని, ప్రజలు వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహలు పెట్టుకోకూడదని, రాష్ట్రంలో బుధవారం నాటికి రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని, 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, మొదటి డోస్ పూర్తయిన వారి సంఖ్య 1 లక్ష దాటిందని, రెండవ డోసు పూర్తయిన వారు 80 వేల మంది ఉన్నారని, ఈ ప్రక్రియపై గిరిజన ప్రాంతాల్లో ఉన్న అపోహలు తొలగించడానికి అన్ని కుల సంఘాల పెద్దలతో, రాయ్ సెంటర్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని, అపోహలు తొలగించడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 18 వేల మంది చొప్పున వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కరోనా వైరస్ ప్రభావంతో అనేక వ్యాపారాలు ఇబ్బందులకు గురయ్యాయని, మీడియా కూడా అనేక ఒడిదుడుకులకు గురైందని అన్నారు. ప్రస్తుతం జిల్లాకు సరిపడేంత డోసులు అందుబాటులో ఉన్నాయని, సాధారణ జీవితం గడపడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక్కటే మార్గమని తెలిపారు. రెండు రోజుల్లో ఉపాధ్యాయులు అందరు వ్యాక్సిన్ తీసుకోవాలని, లేదంటే పాఠశాలకు అనుమతించడం జరగదని తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం పటిష్ట ప్రణాళిక రూపొందించడం జరిగిందని, సబ్ సెంటర్ పరిధిలోని మూడు గ్రామాలను, మున్సిపాలిటీలో ఒక వార్డు ఒక యూనిట్‌గా తీసుకోవడం జరిగిందని, ఒక్కొక్క యూనిట్‌కు ప్రత్యేకంగా వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందు కోసం రెండు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఒకటి సర్వే కమిటీ, రెండు యేరణ కమిటీ అని, సర్వే కమిటీలో అంగన్వాడీ, ఆశ, గ్రామ దీపిక, మల్టీ పర్పస్ వర్మర్ సభ్యులుగా ఉంటారని, పేరణ కమిటీలో సర్పంచ్, వార్డు మెంబర్, పంచాయతీ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ప్రతి సబ్ సెంటర్‌కు ఏ. ఈ.ఓ. నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, మండల స్థాయిలో నిర్వహణకు ఎం.పి.డి.ఓ. ఎం.పి.పి.. సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం రూరల్ సబ్ సెంటర్లలో 108 బృందాలను, కాగజ్‌నగర్ అర్బన్ లో 30 వార్డులలో 30 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వీటితో పాటు 10 ఆర్.బి. ఎస్.కె. వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ రాయ్ సెంటర్ల ప్రతినిధులు, పాత్రికేయులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.