* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 27 ( బుధవారం).
జిల్లా ప్రజలందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ చిట్యాల మండలం ఒడితెల గ్రామంలో గల ఆరోగ్య ఉప కేంద్రంలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్. శ్రీరామ్ జిల్లాలో జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ తీరు పై వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలో ప్రజలు కోవిడ్ బారిన పడరాదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలోని 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ చేయాలనే కృతనిశ్చయంతో నేటి నుండి ప్రత్యేక కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితమైనదని ఈ వ్యాక్సిన్ వేసుకోవడం మూలంగా ఎలాంటి దుష్ఫలితాలు కలగలేదని కోవిడ్ వ్యాక్సిన్ చేసుకోవడం మూలంగా కరోనా వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోగలం కాబట్టి అపోహలు, ఆందోళనలు మాని 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రజలందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్. కొమురయ్య స్థానిక వైద్యాధికారి, స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post