వార్త ప్రచురణ…
శుక్రవారం రోజున
29-10-2021.

జిల్లా అధికారులకి సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపిడిఓ, ఎంపీఓ,స్పెషల్ ఆఫీసర్స్  కి జిల్లా అభివృద్ది పనుల పైన అవగా హన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కోవిడ్ వ్యాక్సి నేషన్, పౌష్ఠిక ఆహారం లోపం , సాని టేషన్ , కమ్యూనిటీ టాయ్ లెట్స్ నిర్మాణం, rofr చట్టం, పంచాయితీ రాజ్ చట్టం , పైన అవగాహన సదస్సును డి ఎల్ ఆర్ ఫంక్షన్ హాలు లో శుక్రవారం నాడు బాల వికాస్ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయనైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ములుగు జిల్లా శాసన సభ్యు రాలు దనసరి అనసూర్య ( సీతక్క) జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గార్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పని చేయాలన్నారు. ప్రతి పల్లె మనదే మనం బాగు చేస్తేనే బాగుపడుతుందన్నారు. వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థ ముఖ్యం అని వారు అన్నారు. పార్టీలను పక్క పెట్టీ జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలని వారు అన్నారు.జెడ్పీటీసీ లు, ఎం పి టి సి లు, సర్పంచు లు, వార్డు మెంబర్ అందరూ కలిసి పని చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ లో మన జిల్లా టాప్ 4th ఉందని, కోవి డ్ వైరస్ ప్రభావం మళ్ళీ ఇతర దేశాలలో ఇప్పటికి తన ప్రభావాన్ని చూపిస్తుందని, మన దరికి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొదటి, రెండవ విడత వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కోవిడ్ బారినపడిన కుటుంబాలలో కుటుంబ సభ్యులను మిస్ అయిన వారిని తీసుకు రాలేము, కానీ ఇకముందు అలాంటి ప్రాబ్లమ్ ఎవరికీ రాకూడదని ప్రతి ఒకరు కోవిడ్ వాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలో సర్పంచులు చాలా బాగా పని చేస్తున్నారని ఏదైనా సాధించాలి అనుకుంటే మీ నుంచి ప్రయత్నం జరగాలని, ఆ ప్రయత్నంలో భాగంగా సర్పంచులు ఎంపీటీసీలు,ఎంపీపీలు  గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. వెంకటాపురం మండలంలో ఇంకా వ్యాక్సిన్ తీసుకోవలసిన వారు ఉన్నారని వారికి వ్యాక్సిన్ వేయించే బాధ్యత వైద్య శాఖ అధికారులతో పాటు గ్రామ సర్పంచ్ లది గా కలెక్టర్ అన్నారు. రానున్న రోజుల్లో ముప్పు రాకముందే జిల్లాలో 100% వ్యాక్సిన్ పూర్తి అవ్వాలని, జిల్లా ప్రజలందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుందని,18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారు అన్నారు.
న్యూట్రిషన్ పైన జిల్లాలో గతంలో రాష్ట్ర స్థాయి కమిటీ చేసిన సర్వే ప్రకారం దేశంలో మన జిల్లాలో పౌష్ఠిక ఆహార లోపం ఉందని తేల్చి చెప్పారు. ఇట్టి విషయంపై గ్రామ సర్పంచులు వారివారి గ్రామాల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లల్ని గుర్తించి వారికి పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులకు సమాచారం ఇస్తూ ఏది లేకున్నా సమకూర్చే బాధ్యత నాది అని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇది మీ ప్రాంతం, మీ ప్రాంత ప్రజల బాగోగులను మీరే చూసుకో వలసిందిగా జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ గ్రామం నాది అనుకుంటే మీ పిల్లల భవిష్యత్తు మీదిగా భావించి పౌష్టికాహారం లోపం లేకుండా ఎదిగే పిల్లలకు పోషకాహారం ఇచ్చే విధంగా సంబంధిత శాఖ అధికారులతో ప్రతినిత్యం గ్రామ పరిస్థితుల గురించి చర్చించవలసిన అవసరం ఉంది గుర్తు చేశారు.
జిల్లాలో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణానికి 27 మంజూరు చేయడమైనది. వాటిని మేడారం జాతర వరకు ముఖ్య కూడళ్ళ లో నిర్మించుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అన్నారు. పంచాయితీ రాజ్ చట్టం సర్పంచులకు తెలియాలని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ చట్టం 2016లో చట్టం చేయడమైనది. మన జిల్లాలో 77% ఫారెస్ట్ ఉందని, కలెక్టర్ అన్నారు.బుస్సాపూర్ నుంచి లక్నవరం వరకు రోడ్డును మంజూరు చేశామని అది ఫారెస్ట్ కాదని గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుందని అన్నారు.

18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టుట ఐటిడిఎ లో బడ్జెట్ ఉందని, ఐటిడిఎ పరిధిలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు ఉన్నత కోర్సుల కోసం ట్రైనింగ్ ఇచ్చుటకు అవగాహన ఉందని, ఏ ఏ సబ్జెక్టులో పట్టు ఉన్న, త్వరగా జాబులు వచ్చే కోర్సుల పైన డెవలప్మెంట్ స్కిల్స్ పైన అవగాహన l క్లాసులను ఏర్పాటు చేసే అవకాశం ఉందని, ఉత్సాహవంతులైన యువకులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ అన్నారు.

పి యమ్ ఇ జి పి రకరకాల స్కీము జిల్లాలోని గ్రామపంచాయతీ పరిధిలో ఏదైనా బిజినెస్ స్కిల్స్ కలిగిన వ్యక్తులను గుర్తించి మూడు ప్రపోజల్ సేన్ ప్రతి గ్రామం నుంచి వచ్చేలా మోటివేషన్ కనిపించినట్లయితే బాధ్యత హామీ ఇచ్చారు. మంజూరు లో సబ్సిడీ కోసం మాత్రమే కాదని లక్ష్యంతో చేయగలిగే ఒక బిజినెస్ ఉంచుకోగలిగితే కుటుంబం బాగుంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (lb) ఇలా త్రిపాఠీ, డి యర్వో రమాదేవి drdo నాగ పద్మజ,dpo వెంకయ్య,జడ్పీ         సి ఈవో ప్రసూన రాణి, ఎస్సీ.కార్పొరేషన్ ఇ డి రవి,dwo ప్రేమలత  శౌరి రెడ్డి, తదితర జిల్లా అధికారులు ఎంపిడిఓలు,ఎంపి ఓ లు, సర్పంచ్ లు ఉప సర్పంచులు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

Share This Post