నవంబర్ 12, 13 మరియు 14 వ తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లాలో  రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల జూనియర్ కం సబ్ జూనియర్ మెన్ హాకీ టోర్నమెంట్ ఏర్పాటు నిమిత్తం భువనగిరి పట్టణంలోని New Dimention School నందు ఏర్పాటు చేయుచున్న సందర్బాములో బాగంగా శ్రీయుత ముకేష్ కుమార్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, ఒలింపిక్ లో మూడు సార్లు పాల్గొనిన, పద్మశ్రీ మరియు అర్జున అవార్డు గ్రహీత ప్రస్తుతం తెలంగాణ హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గారు భువనగిరి పట్టణమునకు ఈ రోజు హాజరైనారు. ఈ సందర్బంగా వారు జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయానికి సందర్శించినారు. దీనిలో బాగంగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, యదాద్రి భువనగిరి జిల్లా కే.ధనంజనేయులు గారు వీరిని ఘనంగా సన్మానం చేసారు. ఈ సందర్బంగా జిల్లాలో హాకీ క్రీడ అభివృద్ధిలో పలు పంచుకుంటమని అదేవిదంగా New Dimention School, భువనగిరి నందు ఏర్పాటు చేయబోయే  రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల జూనియర్ కం సబ్ జూనియర్ మెన్ హాకీ టోర్నమెంట్ కు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ నందు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసినారు.  తదుపరి విరు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఐఏఎస్ గారికి కలసి రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల జూనియర్ కం సబ్ జూనియర్ మెన్ హాకీ టోర్నమెంట్ కు సంబందించిన లోగోను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాములో యాదాద్రి భువనగిరి జిల్లా హాకీ సమాఖ్య  అధ్యక్షుడు శ్రీ బుయ్య కిరణ్ కుమార్ గారు, తెలంగాణ హాకీ ట్రెజర్ భాస్కర్ రెడ్డి గారు, తెలంగాణ హాకీ కోచ్ దశరథ్ గారు, ఉమ్మడి నల్గొండ హాకీ సెక్రెటరీ కరీం గారు, లచు,మల్లేష్ గారు, మని,శోభారాణి, అనిత మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Share This Post