మొబైల్ యాప్ ద్వారా తల్లి, పిల్లల ఆరోగ్య వివరాలను పర్యవేక్షించాలి….

ప్రచురణార్థం

మొబైల్ యాప్ ద్వారా తల్లి, పిల్లల ఆరోగ్య వివరాలను పర్యవేక్షించాలి….

మహబూబాబాద్, 2021 నవంబర్-02:

తల్లి, పిల్లల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు మొబైల్ యాప్ లో నమోదు చేసి పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అంగన్ వాడి లను కోరారు.

మంగళవారం స్థానిక గిరిజన భవన్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ లను అందించారు.

మహిళా, శిశు సంక్షేమ శాఖ తరపున అంగన్వాడీ లకు స్మార్ట్ మొబైల్స్ ను మంత్రి, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అంగన్ వాడిలకు అందజేశారు.

ఈ సందర్భంగా అందించిన స్మార్ట్ ఫోన్ లో రూపొందించిన యాప్, సాఫ్ట్వేర్ వలన తల్లి, పిల్లల వివరాలు, ఆరోగ్యం, ఇతర విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేలా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ person అంగోతు బిందు, ఎం.పి.- మాలోతు కవిత, ఎమ్మెల్యేలు హరిప్రియ, శంకర్ నాయక్, CFO భీమ్ల నాయక్, ఎస్పీ – కోటి రెడ్డి, ఐటిడిఎ పి. ఓ. గౌతం, డి.ఎఫ్. ఓ. రవికిరణ్, జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి,కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారి చేయనైనది.

Share This Post