5వ విడిత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 6వరోజు మాగనూర్ మండలం లో పలు గ్రామాలను తనిఖీ చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి k. వనజ అంజనేయులు గౌడ్

5వ విడిత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 6వరోజు మాగనూర్ మండలం లో పలు గ్రామాలను తనిఖీ చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి k. వనజ అంజనేయులు గౌడ్ గారు.. ఇందులో భాగంగా  మాగనూర్ మండలం లోని వడ్వడ్, అడవి సత్యర్ గ్రామాలలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తనిఖీ చేశారు, వడ్వడ్ లో పాడుబడిన ఇండ్లను చూసి వాటి యజమానులను పిలిపించి మాట్లాడారు, నోటీసు ఇచ్చి వెంటనే వాటిని కూల్చాలని అధికారులను ఆదేశించారు, అడవి సత్యార్ లో  నూతనంగా ఏర్పాటు చేస్తున్నా తెలంగాణ క్రీడా ప్రాంగనం కు భూమి పూజ చేసి, రైతు వేదిక ప్రాంగణం లో మొక్కలు నాటారు.

 

జిల్లాలో లోని అన్ని గ్రామాలలో పాడుపడిన ఇండ్లను కూల్చాలని, వాడుకలో లేని బోరు బావులను మూసివేయాలని, మరుగుదొడ్లు ను వాడని వారు కచ్చితంగా వాడాలని, మురుగునీరు ఇంకుడు గుంతలకు మల్లించాలని, మొక్కలకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్  ద్యార నీరు ప్రతి రోజూ పొయ్యలని, నర్సరీల్లో మొక్కల పేర్లు, సంఖ్య తోకుడిన చార్ట్ ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ చంద్ర రెడ్డి గారు,ఎంపిడిఓ సుధాకర్ గారు , ఎంపిఓ గారు, అయా  గ్రామ  సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Share This Post