5వ శక్తి పీఠం అయిన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామీ ఆలయ అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, అబ్కారి, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

పత్రికా ప్రకటన                                                       తేదీ:04-01-2022

5వ శక్తి పీఠం అయిన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర  స్వామీ ఆలయ అభివృద్ధే  ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, అబ్కారి, క్రీడా  శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మంగళవారం ఎంపీ రాములు, అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం , గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.సరిత తిరుపతయ్య,  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తో కలిసి జిల్లాలోని అలంపూర్ తుంగభద్ర నది తీరాన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ సమీపంలో ప్రసాద్ స్కీం నిధులతో చేపట్టిన పనులను పరిశీలించి, తుంగభద్ర నది ఒడ్డున నిర్మించ తలపెట్టిన నమూన స్టాల్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.  జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాన్ని  దర్శించుకున్నారు . ఆలయ అర్చకులు మంత్రిగారికి పూర్ణకుంభం తో స్వాగతం పలికి , అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారి ఆశిస్సులు అందజేశారు. మంత్రికి శేష వస్త్రాలు సమర్పించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆలంపూర్ బి.ఆర్.ఎస్. ఫంక్షన్ హాలు లో ప్రసాద్ స్కీం నిర్వహణ పై ఏర్పాటు చేసిన సమవేశం లో మంత్రి మాట్లాడుతూ శక్తి పీఠాలలో ఒకటైన అయిదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని,  జోగులాంబ ఆలయ అభివృద్ధే  ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత కృష్ణ పుష్కరాల సమయంలో హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి  కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా టెండర్ల ప్రక్రియ ద్వారా ఆలయ అభివృద్ధి  కోసం ప్రసాద్ స్కీం భవనం మంజూరు కావడం జరిందని, ఆలయాల అభివృద్ధి కాకుండా మిగతా  అభివృద్ధి పనుల కోసం ముఖ్య మంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. ప్రసాద్ స్కీం లో నిర్మిస్తున పనుల భవనాల చిత్రాలను ఆవిష్కరించారు.

అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం మాట్లాడుతూ ప్రసాద్ స్కీం పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి గారిని  కోరారు.  అలంపుర్ నియోజక వర్గంలో ఉన్న వివిధ సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి , శ్రీమతి.ఎస్.వాణి దేవి , అలంపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి. మనరోమ వెంకటేశ్ , అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగుళాంబ గద్వాల జిల్లా గారి చె జారి చేయనైనది.

Share This Post