జిల్లాలో పోడు భూముల పై ముమ్మరంగా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు. ములుగు,వెంకటాపూర్,తాడ్వాయి,ఏటూరునాగారం,మంగపేట,గోవిందరావు పేట,కన్నాయి గూడెం,వెంకటాపురం,వాజేడు మండలాలలో మొత్తం 7944 దరఖాస్తులు స్వీకరించాం అని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అడవులను రక్షించుటే లక్ష్యంగా, భవిష్యత్తులో అడవులు అన్యాక్రాంతం కాకూడదని
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోడు భూముల సమస్య పరిష్కరించుట మరియు అడవులను పరిరక్షించాలనే ఉద్దేశం తో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని అన్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తులు సమర్పిం చాలని కలెక్టర్ అన్నారు
కొత్తగా ఎవ్వరైనా పోడు చేసినట్లు అయితే ఫారెస్ట్ ఆక్ట్ ప్రకారం కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుందని ప్రజలు ఇట్టి విషయం గమనించాలని కలెక్టర్ అన్నారు.