* ప్రచురణార్థం*
ములుగు జిల్లా నవంబర్ 15( సోమవారం )
ప్రసవాలకు పుట్టినిల్లు ప్రభుత్వ ఆసుపత్రులు అని ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడి అత్యధిక ప్రసవాలు జరిగే విధంగా చూడాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.

సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయ సమావేశ లో జిల్లా ప్రజలకు అందుతున్న వైద్యసేవలు పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య ఆధ్వర్యంలో ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి , ఏటూరు నాగారం సి హెచ్ సి సూపర్డెంట్ ,చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్ అధికారి, క్షయ మరియు కుష్టు వ్యాధి నియంత్రణ అధికారి, మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల తో జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు జిల్లా లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ వైద్యాధి కారుల సేవలు అభినందనీయమని ఇన్స్టిట్యూషన్ వారీగా రెగ్యులర్, కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్, సిబ్బంది జీతభత్యాలు ఈ విషయంలో పెండింగ్లో పెట్టకుండా, వారికి జీతాలు మంజూరయ్యే విధంగా చూడాలని అదేవిధంగా ఆశా వర్కర్ల గౌరవ వేతనం అందాలని మరియు ఇన్స్టిట్యూషన్స్ లో మంజూరైన నిధులతో ఖర్చు చేసిన లావాదేవీల వివరాల గురించి ఆన్లైన్ డేటా సమర్పించాలని, వైద్యాధికారులు సిబ్బంది ఆన్ లైన్ అటెండెన్స్ యాప్ లో అటెండెన్స్ వేస్తున్నారా లేదా,అనే విషయం పై చర్చిచారు. ఎవరైనా సెలవు దరఖాస్తు చేసినప్పుడు డి డి ఓ ద్వారా ఆన్లైన్లో సెలవు దరఖాస్తు చేసుకుంటున్నారా క్షేత్రస్థాయిలో పర్యటనలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలనకు వెళ్లినప్పుడు సెలవు దరఖాస్తు లేకుండా గైర్హాజరు అయితే సంబంధిత వైద్యాధికారులు సిబ్బంది పై చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్య కేంద్రాలలో నిధులు మంజూరు అయినప్పుడు స్కీం వారిగా ఖర్చుల వివరాలు ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్, సంబంధిత సీనియర్ అసిస్టెంట్లు సక్రమంగా నిర్వహించి నివేదికలు అందించాలని అన్నారు.అలాగే అధికారులు సిబ్బంది సర్వీస్ మేటర్స్ సర్వీస్ రిజిస్టర్ లో నమోదు చేయాలని ఇన్స్టిట్యూషన్ వైద్య పరికరాలు స్టాక్ రిజిస్టరు లో మెయింటెన్ చేయాలని అన్నారు. పి హెచ్ సి వారీగా ఉద్యోగుల ఖాళీల వివరాలు సంబంధించిన సమాచారం వెంటనే అందించాలని అన్నారు. ఫార్మసిస్ట్ లు వివిధ వ్యాధులకు 02 నెలలకు సంబంధించిన మందులు బఫర్ స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని సంబంధిత స్టాక్ రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. ఈ ఔషధీ పోర్టల్ లో ఓ పి మాడ్యూల్స్ పొందుపరచాలని ఆస్పత్రి భవనాల మరమ్మతులు వివరాలు అలాగే సబ్ సెంటర్ వారిగా పోగ్రామ్ వైస్ పెర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ వివరాలను వెంటనే సమర్పించాలని అన్నారు. 393 క్షయ వ్యాధి గ్రస్తులకు పోషణ నిమిత్తం ప్రభుత్వం ద్వారా అందించవలసిన ఇన్సెంటివ్ వెంటనే అందే విధంగా నివేదికలను తయారు చేయాలని అన్నారు. మండలాల వారిగా సబ్ సెంటర్లలో ఇమ్యునైజేషన్ ,మలేరియా డెంగ్యూ , వ్యాధులనుండి ప్రజలను రక్షించడంలో తీసుకున్న చర్యలు పై నివేదికలను అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు ములుగు ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ జగదీశ్వర్ డిసిహెచ్ఎస్ డాక్టర్ జాన్సన్ ఏటూర్ నాగారం సిహెచ్ సి సూపరిండెంట్ డాక్టర్ సురేష్ కుమార్ చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్యాంసుందర్, క్షయ మరియు కుష్టు వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ రవీందర్ ,కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ సీతారామరాజు, ఎల్ నవీన్ రాజ్ కుమార్ డెమో సంబంధిత మెడికల్ అధికారులు పాల్గొన్నారు.
……………………………………………………………………………………………………………………………………

Share This Post