ప్రజా విజ్ఞప్తుల పై చర్యలు తీసుకుంటాం

ప్రచురణార్థం

ప్రజా విజ్ఞప్తుల పై చర్యలు తీసుకుంటాం.

మహబూబాబాద్ నవంబర్ 22.

ప్రజా విజ్ఞప్తులు సమగ్రంగా పరిశీలించి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల నుండి పలు విజ్ఞప్తులు స్వీకరించారు.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఉటాయి గ్రామానికి చెందిన భూక్య విజయలక్ష్మి దరఖాస్తు అందిస్తూ కోవిద్ లో వైద్య సేవలు అందించానని, తనకు అర్హతలు ఉన్నందున నర్స్ ఉద్యోగం ఇప్పించాలని కోరారు.

మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఎస్ డి. ఇమామ్ దరఖాస్తు అందిస్తూ పాములు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారని తనకు ఉండడానికి ఇల్లు కూడా లేదని రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కేసముద్రం మండలం స్టేషన్ కేసముద్రం కు చెందిన దళిత కుటుంబాలకు చెందిన బి కుమార్ స్వామి యాదగిరి సుధాకర్ తదితరులు విజ్ఞప్తిని అందిస్తూ వరద కాలువను తమ ఇండ్ల వైపు మళ్ళించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన ఎర్రం సునీత దరఖాస్తును అందిస్తూ రిచిక స్వయం సహాయక సంఘాల సి ఎ కంచనపల్లి వెంకన్న సీసీ పరశురాం ఎర్రం సుమలత పప్పుల ఉమా లతో కలిసి తమకు తెలియకుండా ఫోర్జరీ తీర్మానంతో 50000 డ్రా చేశారని చర్యలు తీసుకోవాలన్నారు.

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనగ పురం రోడ్డు లో డ్రైనేజీ పనులు చేపడుతున్నారని వేగవంతంగా చేయకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు యాకోబు బి ఫిర్యాదు అందచేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని సత్వర చర్యలు తీసుకునే విధంగా అధికారులను ఆదేశిస్తామని అన్నారు.

ఈ గ్రీవెన్స్ డే లో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్ కొమరయ్య జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
——————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post