నర్సరీల మొక్కల పెంపకంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి…

ప్రచురణార్థం

నర్సరీల మొక్కల పెంపకంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి…

మహబూబాబాద్ నవంబర్ 24.
హరితహారం కొరకు జిల్లాలో చేపడుతున్న నర్సరీల మొక్కల పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయం ప్రగతి సమావేశ మందిరంలో హరితహారం నర్సరీ ఉపాధిహామీ పల్లె ప్రగతి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఎంపీడీవో లతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సరీ పెంపకం నిరంతర ప్రక్రియగా భావించాలన్నారు.

నర్సరీల నిర్వహణలో బ్యాగ్ ఫిల్లింగ్ చేసిన వారికి సకాలంలో నగదు పంపిణీ చేయాలన్నారు.

నర్సరీ లతోపాటు ప్రైమరీ బెడ్స్ కూడా ఏర్పాటు చేయాలన్నారు.

నర్సరీలలో పెంచుతున్న మొక్కలు కాకుండా పౌష్టికాహారాన్ని దృష్టిలో ఉంచుకొని కరివేపాకు వంటి విభిన్న రకాల మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

మొక్కల పెంపకంపై మరొకసారి శిక్షణ కార్యక్రమం చేపట్టాలన్నారు. గృహ అవసరాలకు తగినట్లుగా మొక్కల పెంపకం చేపట్టాలని ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.

ఉపాధి హామీ పథకం క్రింద పనులు చేపట్టేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నందున పనులు సకాలంలో చేపట్టాలని ప్రగతి చూపాలన్నారు.

పల్లె ప్రగతి లో చేపట్టిన పనులలో నిర్వహణ లోపాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post