ప్రచురణార్థం
ములుగు జిల్లా 24( బుధవారం )

గిరిజన నిరుద్యోగ మహిళలకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్( A.N.M) లు గా రెండు సంవత్సరాల వసతి తో కూడిన ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.
బుధవారం రోజున కలెక్టర్ కార్యాలయంలో గిరిజన మహిళలకు మల్టీపర్పస్ వర్కర్స్ ( ఏ ఎన్ ఎం) శిక్షణ కార్యక్రమం పై కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి సహకారంతో జిల్లా దుర్గాబాయ్ మహిళ వికాస కేంద్రం మడికొండ వరంగల్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా లోని ఎస్టి గిరిజన మహిళలకు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ గా ( ఏఎన్ ఎం) లు గా 2 సంవత్సరాల వసతి తో కూడిన ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని కలెక్టర్ అన్నారు.మొత్తం 40 సీట్లు కలవని మల్టీపర్పస్ వర్కర్స్( ఏ ఎన్ ఎమ్) శిక్షణ కొరకు 35 సంవత్సరాల లోపు ఉండి ,ఎనీ ఇంటర్ పాస్ అయిన మహిళలు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు కుల ధ్రువీకరణ పత్రం , ఆదాయం, ఆధార్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తో పాటు జీరాక్స్ ప్రతుల పైన ప్రభుత్వ అధికారి చేధృవీకరించిన ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, జత చేస్తూ 06 పాస్ పోర్ట్ ఫొటోస్ జతపరిచి డిసెంబర్ 15 లోపుదుర్గాబాయ్ మహిళ శిశు వికాస కేంద్రం మడికొండ వరంగల్ వారికి దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇతర వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ తెలియజేశారు
మొబైల్ నెంబర్.7660022525 తెలియజేశారు

ఈ కార్యక్రమంలో దుర్గాబాయి మహిళ వికాస కేంద్రం వరంగల్ మడికొండ జిల్లా అధికారి ని శ్రీమతి పి .జయశ్రీ అకౌంటెంట్ హేమ రాణి
తదితరులు పాల్గొన్నారు .
……………………………………………………….

Share This Post