కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని కలెక్టరేట్ అధికారులు, సిబ్బందిచే ప్రమాణ ప్రతిజ్ఞ చేయించారు.

ప్రచురణార్ధం

నవంబరు 26, ఖమ్మం:

భారత రాజ్యాంగం అమోదించబడి 72 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని కలెక్టరేట్ అధికారులు, సిబ్బందిచే ప్రమాణ ప్రతిజ్ఞ చేయించారు. భారత దేశ స్వాతంత్య్ర అనంతరం స్వ పరిపాలనకు గాను రాజ్యాంగ రూపకర్త డా॥ బి. ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం 1949 వ సంవత్సరం నవంబరు 26 వ తేదీన ఆమోదించబడిందని, రాజ్యాంగ రూపకర్తలందరిని స్మరించుకుంటూ భవిష్యత్తు తరాలకు భారత రాజ్యాంగం గురించి తెలియజేసేందుకు ఆజాదికా అమృత్ మహోత్సవాలలో భాగంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.

జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, కలెక్టర్ కార్యాలయపు పరిపాలనాధికారి మదన్ గోపాల్, అధికారులు, సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post