రుణాలు ఇవ్వడమే కాదు చెల్లింపులు సక్రమంగా జరిగేలా అధికారులు కృషి చేయాలి…

ప్రచురణార్థం

రుణాలు ఇవ్వడమే కాదు చెల్లింపులు సక్రమంగా జరిగేలా అధికారులు కృషి చేయాలి…

మహబూబాబాద్ డిసెంబర్ 2.

స్త్రీ నిధి రుణాలు మంజూరు చేయటమే కాదని చెల్లింపులు సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో స్త్రీ నిధి రుణాల పై జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 98.12 కోట్లకు రుణ లక్ష్యాల సాధింపుకు 40.23 లక్షల రుణాలను మంజూరు చేసి 41 శాతం లక్ష్యాలు సాధించడం జరిగిందన్నారు.

స్త్రీ నిధి అధికారులు రుణాలను మంజూరు చేయడమే కాదని తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమైన పాడిపరిశ్రమతో పాటు కోళ్ల ఫారం లు నెలకొల్పుకునేందుకు పశుసంవర్ధక శాఖ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. రుణాలను సకాలంలో చెల్లించే గ్రూప్ లకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త గ్రూప్ లకు కూడా అవకాశమివ్వాలన్నారు. మంజూరు చేసిన రుణాలు వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ రాణించేందుకే అవకాశమివ్వాలన్నారు. జిల్లాలో మదర్ యూనిట్ (కోడి గ్రుడ్లు పిల్లలను చేసే పరిశ్రమ)పెట్టేందుకు కృషి చేయాలన్నారు. అదే విధంగా పాడి పరిశ్రమలో 4 గ్రామాలకు ఒక బల్క్ చిల్లింగ్ యూనిట్స్ పెట్టుకునే వారు ముందుకు వస్తే రుణాలు ఇవ్వాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో డి.ఆర్.డి.ఏ.పీడీ సన్యాసయ్య, అదనపు పీడీ వెంకట్, స్త్రీ నిధి ఆర్.ఎం. రవీంద్రనాయక్, డి.పి.ఎం నళిని, స్త్రీ నిధి సహాయ మేనేజర్లు పాల్గొన్నారు.
———————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం …వారిచే జారిచేయనైనది.

Share This Post