57 సంవత్సరాలు నిండిన అర్హులైన వృద్ధులు ఆసరా వృద్ధాప్య పెన్షన్ కు ఈ నెల 30 లోగా మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చు:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*

నల్గొండ,అక్టోబర్ 10.ఆసరా వృద్దాప్య పెన్షన్ మంజూరు వయస్సు 65 సంవత్సరాలు నుండి 57 సంవత్సరాలకు ప్రభుత్వం తగ్గించి ఉత్తర్వులు జారీ చేసినందున,దరఖాస్తు నాటికి
57 సంవత్సరాలు వయస్సు నిండిన అర్హులైన వృద్ధులు  మీ సేవ , ఈ సేవ కేంద్రాల ద్వారా కొత్తగా ఆసరా వృద్దాప్య పెన్షన్ కోసం ఈ నెల 30 వరకు  దరఖాస్తు చేసుకొనుటకు ప్రభుత్వం గడువు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ సేవా/ఈ సేవ    కేంద్రాలలో 57 సంవత్సరాల వయస్సు  దాటిన అర్హులైన వృద్ధులు  పింఛన్ కోసం చేసుకున్న దరఖాస్తుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, పూర్తిగా ఉచితంగానే ఈ సేవలు లభిస్తాయని ఆయన  తెలిపారు. దరఖాస్తు సమయంలో అర్జీదారు అతని యొక్క 1) ఆధార్ కార్డు
 2) ఓటర్ కార్డు
3) పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
 4) రన్నింగ్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్., వృద్ధాప్య వయసు దృవీరకరణకు ఓటర్ కార్డు/ పుట్టిన తేదీ పత్రము/ స్కూల్ సర్టిఫికెట్ ల పుట్టిన తేదీని ప్రామాణికంగా భావిస్తారని తెలిపారు. ఆసరా పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకునే వ్యక్తి  బయోమెట్రిక్ వేయవలసి ఉంటుందని, కావున దరఖాస్తు చేసుకునే వ్యక్తి  మీసేవ కి తప్పకుండా రావలసి ఉంటుందని,
దరఖాస్తు ఈ నెల 30  గడువు తేదీ లోగా చేసుకోవాలని ఆయన ఈ ప్రకటన లో పేర్కొన్నారు.
Attachments area

Share This Post