తొర్రూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం

ప్రచురణార్థం-
తొర్రూర్ /మహబూబాబాద్ 14 డిసెంబర్2021.

తొర్రూర్ డివిజన్, మున్సిపాలిటీ కేంద్రాన్ని రాష్ట్ర అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచి ఆదర్శవంతమైన పాలనను ప్రజలకు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

మంగళవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, పాలకవర్గం తో తొర్రూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కృషితో ప్రణాళికాబద్ధంగా తొర్రూరు మున్సిపాలిటీ ని అభివృద్ధి పదంలో ముందుంచాలని,మరిన్ని నిధులతో మెరిసేలా పట్టణం అభివృద్ధి జరగాలని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుకోవాలని తొర్రూర్ పట్టణాన్నికి నిధులను సద్వినియోగం చేసుకొని మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శంగా మారుద్దాం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి తెలిపారు.
110 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని తెలిపారు.

తొర్రూరు మున్సిపాలిటీలో చేపట్టిన పనులు, పూర్తి అయినవి చేయాల్సినవి, ప్రతి ఇంటికి నీరు అందించాలనే మిషన్ భగీరథ తాగునీటి సరఫరా, రెండు పడకల గదుల నిర్మాణం, విద్యుత్ సరఫరా, పి ఆర్ ఆర్ అండ్ బి, ఎన్ హెచ్ రోడ్ల నిర్మాణాలపై, ట్రాఫిక్ నియంత్రణ, కొత్త అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదిత, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, అప్గ్రేడ్ అభివృద్ధి, కొత్త ఎఫ్ ఐ డి సి నిధులపై సమీక్ష తదితర అంశాలపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

మంత్రి గారు అందించిన సలహాలు, సూచనలు

6 కోట్లతో బిటి రోడ్లను సీసీ రోడ్లు గా మార్చడానికి ప్రతిపాదనలు

కొత్త ఇంటి నిర్మాణాలకు ప్లానింగ్ ప్రకారం పర్మిషన్లు

విద్యుదీకరణ, డ్రైనేజ్, రోడ్లు, పారిశుద్ధ్యం, నిర్మాణాల పై ప్రత్యేక శ్రద్ధ

కౌన్సిలర్లు వారి వారి వార్డులలో పర్యటించి, సమస్యలను పరిష్కరంచాలి

మంచి డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలి

*వార్డుల వారీగా సమస్యలను చర్చించి పలు సమస్యలకు వెంటనే పరిష్కారాలు చూపిన మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

తొర్రూరు పట్టణం కొత్తగా అభివృద్ధి చెందుతున్న, ఇంకా బాగా అభివృద్ధి చేయగలిగిన పట్టణం అన్నారు. ఈ పట్టణాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దటానికి సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. మంచి డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలను సూచించారు. కొత్త ఇంటి నిర్మాణాలకు ప్లానింగ్ ప్రకారం పర్మిషన్లు ఇవ్వాలని, 6 కోట్లతో బిటి రోడ్లను సీసీ రోడ్లు గా మార్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. కౌన్సిలర్లు వారి వారి వార్డులలో పర్యటించి, సమస్యలను పరిష్కరంచాలి. ప్రజల్లో ఉంది వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఉద్బోధించారు.

ఇప్పటికే 100 కోట్లకు పైగా నిధులు తెచ్చామని, ఆయా పనులు అభివృద్ధి పథంలో ఉన్నాయన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు 43 కోట్ల 20 లక్షలు, ఇతర అభివృద్ధి పనులకు 67 కోట్లు ఖర్చు చేశామన్నారు.

తొర్రూరు లో శాశ్వత మంచినీటి సర్ఫర కోసం 6 కోట్ల 73 లక్షలు, మిషన్ భగీరథ కింద నల్లా కనెక్షన్ల కోసం 5 కోట్లు 77 లక్షలు ఖర్చు చేశామన్నారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కోసం 2 కోట్ల 95 లక్షలు, డివైడర్ల కోసం 5 కోట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ కోసం 5 కోట్ల 30 లక్షలు వ్యయం చేశామన్నారు. యతి రాజారావు పార్క్ కోసం 6 కోట్ల 18 లక్షలు, ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ కోసం 4 కోట్లు, వైకుంఠ దామాలకు 10 లక్షలు, ఎస్సీ సబ్ ప్లాన్ కింద కోటి, పట్టణ ప్రగతి నిధులు 4 కోట్ల 50 లక్షలు, Tufidc నిధులు 31 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వివరించారు.

ఇంకా, పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ను మరింత అభివృద్ధి చేస్తాం. డ్రైనేజ్ వ్యవస్థ ను మరింత మెరుగు పరచాలి. 100 శాతం మిషన్ భగీరథ మంచినీరు తొర్రూరు ప్రజలకు నల్లాల ద్వారా అందించాలి. అందుకు అవసరమైతే, పట్టణం కోసం ప్రత్యేకంగా అధియారి, వర్కర్లను నియమించాలి. కంఠా య పాలెం రోడ్డు సహా తొర్రూరు చుట్టుముట్టు రోడ్లను సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తో డివైడర్లు ఏర్పాటు చేయాలి. ప్రణాళికలు సిద్ధం చేయాలి.

కౌన్సిలర్లు, అధికారులను వార్డుల వారీగా బాధ్యులను చేయాలి. అక్కడి సమస్యలకు వారినే బాధ్యులను చేయాలి. ఒకవేళ ఎక్కడైనా సమస్యలు అలాగే ఉంటే, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.

పట్టణ ప్రగతి, Tufidc రెండో విడత నిధులు 3 కోట్లకు పైగా వచ్చాయి. వాటికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని, పట్టణ సుందరీకరణకు, మున్సిపాలిటీ నూతన భవనం, అతిథి గృహం, కొత్త రోడ్లు, డ్రైనేజ్, మౌలిక వసతులకు సరైన పద్ధతిలో ప్రణాళికలు రూపొందిస్తామని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ మంత్రి కి చెప్పారు. తొర్రూరు ని అన్ని విధాలుగా ముందుంచుతామని చెప్పారు.

కరోనా నేపథ్యంలో అందరికీ 2వ డోస్ టీకాలు వేయించాలి. ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్లు వేయించాలి. కరోనా సమయంలో ఎర్రబెల్లి ట్రస్ట్ నుంచి, నా సొంతంగా భారీగా నిధులు ఖర్చు చేసినాను. బాధితులకు నిత్యావసర సరుకులు ఇచ్చాం. అంబులెన్స్ లు ఇచ్చాం. కష్టకాలం లో ప్రజలను ఆదుకోవాలి. ప్రతి ఒక్కరం లక్ష్య శుద్ధితో, చిత్తశుద్ధితో పనిచేయాలి. కూరగాయల మార్కెట్, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల ఏర్పాటులో తొర్రూరు రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా ఆదర్శంగా నిలిచింది.

కాగా అధికారులు సంన్వాయంతో పని చేయాలని మంత్రి సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో. జిల్లా కలెక్టర్ శశాంక, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఎంపీపీ అంజయ్య, జెడ్ పి టి సి శ్రీనివాస్ , వివిధ శాఖల జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, కమిషనర్ గుండె బాబు, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ కాకినాడ హరి ప్రసాద్ పట్టణ అభివృద్ధి కమిటీ సోమేశ్వరరావు సీనియర్ నాయకులు వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————–
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం మహబూబాబాద్ చే జారీ చేయడమైనది.

Share This Post