ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న అదనపు భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి…

ParagraphWP Easy Gall

ప్రచురణార్థం

ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న అదనపు భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి…

మహబూబాబాద్, 2021 డిసెంబర్ – 15:

ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు బెడ్స్ ఏర్పాటు చేయుటకు నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వాసుపత్రిలో చేపడుతున్న అదనపు భవన నిర్మాణ పనులను పరిశీలించారు.

పనుల పురోగతి పై ఇంజనీరింగ్, వైద్యాధికారులతో మాట్లాడి, పనులు నాణ్యతగా ఉండే విధంగా పర్యవేక్షిస్తూ వేగవంతంగా పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు.

ఇప్పటి వరకు చేసిన పనులను పరిశీలించారు. Roofing, brick works, plasting, ఎలక్ట్రిసిటీ, ఇతర పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కలెక్టర్ ఫిమేల్ వార్డ్ ను పరిశీలించి, వార్డ్ లో ఉన్న పేషంట్ లకు అందిస్తున్న సేవలను, డాక్టర్ round వారీగా పరిశీలన చేస్తున్న వివరాలను, రిజిస్టర్ ను పరిశీలించి రిజిస్టర్ లో తప్పనిసరి గా నమోదు చేయాలన్నారు

ఈ కార్యక్రమంలో టి ఎస్ ఎమ్ ఐ డి సి ఈ ఈ ఉమా మహేష్ డి ఈ శ్రీనివాస్ ఆర్ ఎం ఓ వైదేహి డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
———————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post