మహిళా ఉద్యోగినుల పై లైంగిక వేధింపులు తగదు…

ప్రచురణార్ధం

మహిళా ఉద్యోగినుల పై లైంగిక వేధింపులు తగదు…

మహబూబాబాద్, డిసెంబర్-15:

మహిళా ఉద్యోగినుల పై లైంగిక వేధింపులు తగదని జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ హితవు పలికారు.

బుధవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యం లో మహిళా ఉద్యోగినులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు అనే అంశంపై సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ మహిళ ఉద్యోగినులు పై లైంగిక వేధింపులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా వేధింపులను అరికట్టేందుకు ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేస్తామన్నారు.

మహిళలపై లైంగిక వేధింపులు, నివారణ, నిషేదం, పరిష్కార విధానాలు చట్టం-2013, మార్గదర్శకాలను వివరించారు చట్ట ప్రకారం తీసుకునే చర్యలు వివరిస్తూ వారి కోసం ఒక ప్రత్యేక క కమిటీ ఉందని, అంతర్గత ఫిర్యాదుల కమిటీ కొరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక ఫిర్యాదుల కమిటీ గురించి వివరిస్తూ ఉద్యోగినుల పట్ల సోదర భావం కలిగి ఉండాలని వేధింపులు తగదన్నారు

అంతర్గత ఫిర్యాదుల కమిటీ పాత్ర, బాధ్యతలు, ఫిర్యాదు తీసుకోవల్సిన చర్యల గురించి చెప్తు ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటిని ఏర్పాటు చేయాలన్నారు.  అన్ని శాఖల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.  సఖి తరపున అంతర్గత ఫిర్యాదుల కమిటీ పై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మహిళలకు అర్థమయ్యేలా వివరించారు.

ఈ కార్యక్రమంలో సి. డబ్ల్యు. సి. చైర్ పర్సన్, నాగ వాణి మున్సిపల్ కమీషనర్ ప్రసన్నారాణి, కలెక్టరేట్ సెక్షన్ అధికారిణి అనురాధ, ఎస్. ఐ. రమాదేవి, సి. డి. పి. ఓ. లు, సూపర్ వైజర్లు, అంతర్గత ఫిర్యాదుల కమిటీ మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.
————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయం చే జారీ చేయనైనది.

Share This Post