ఓటరు నమోదు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎలాక్టోరల్ పరిశీలకులు శైలజా రామయ్యర్

ఓటరు నమోదు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఎలాక్టోరల్  పరిశీలకులు శైలజా రామయ్యర్

జిల్లాలో ఓటరు నమోదుకై స్వీప్ చేపట్టిన కార్య్రక్రమాలు చాలా బాగున్నాయని ఎలక్టరోల్ పరిశీలకులు శైలజ రామయ్యర్ కితాబిచ్చారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్, అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి 5 జనవరి 2022 న ప్రకటించు ఓటర్ల తుది జాబితా సందర్భంగా ఓటర్ల నమోదు, సవరణలు, తొలగింపులు పై తహసీల్ధార్లు, బి.ఎల్.ఓ.తో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎక్కువ మంది యువత ఆన్ లైన్ ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవడం ముదాహమని, ఇందుకోసం కళాశాల స్థాయిలో క్యాంపస్ అంబాసిడర్లకు ఓటర్ హెల్ప్లైన్ పై అవగాహన కలిగించి ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు నమోదు ప్రక్రియ చేపట్టడం సంతోషకరమని అన్నారు. మెదక్, నరసాపూర్ నియోజక వర్గాలలోని బ్లాక్ స్థాయి అధికారులు కూడా గరుడ యాప్ పై పూర్తి అవగాహన కలిగి అందులో వివరాలు నమోదు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటరు నమోదులో పుట్టిన తేదీకి ప్రాదిపదిక 10 వ తరగతి మెమో లేదా నిరాక్షరాస్యులకు ఏదేని జనన ధ్రువపత్రం ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జాబితాలో పేర్లు తొలగించేటప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి సూపర్ చెక్ చేసి ఆ కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించి సంతకాలు తీసుకోవాలని, మరణించిన వారి విషయంలో డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలని, సుమోటాగా పేర్లు తొలగించేటప్పుడు సమగ్ర వివరాలు సేకరించి ఓటరు జాబితాలో తొలగింపుకు కారణాలు పేర్కొనాలని, ఎవరి, ఎప్పుడు, ఎక్కడ సంప్రదించారో వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. ప్రధానంగా బ్లాక్ స్థాయి అధికారులు ఓటరు జాబితాలో ప్రజాప్రతినిధులు, ప్రముఖుల పేర్లు సరిగ్గా ఉన్నాయా అని పరిశీలించుకోవాలని, ఎన్నికల సమయంలో పేర్లు లేకపోతె ఇబ్బందులు పడవలసి వస్తుందని సూచించారు. బల్కు గా ఓటరు నమోదు లేదా తొలగింపుకు దరఖాస్తులు వస్తే క్షేత్ర స్థాయిలో ఎలక్ట్రారోల్ అధికారి పరిశీలించాలని సూచించారు. పెళ్లయిన ఒక అమ్మాయి ఆ ఊరికి వచ్చి పేరు నమోదు చేసుకుంటే సరిగ్గా పరిశీలించడంతో పటు ఇతర నియోజక వర్గంలో పేరుంటే తొలగించుకోవాలని సూచించాలని అన్నారు. అదేవిధంగా పేరు,వయస్సు, చిరునామా మార్పు వంటి అంశాలలో స్పష్టమైన ధ్రువపత్రాలుంటేనే ఓటరు జాబితాలో మార్పులు,చేర్పులు చేయాలని సూచించారు. ఫోటో లు సరిగ్గా లేకపోతె మల్లి ఓటరు ఫోటో తీసుకొని అప్ లోడ్ చేయాలని అన్నారు. ఓటరు నమోదు కై ఆన్ లైన్ లో వస్తున్న ధరఖాస్తులతో పాటు మాన్యువల్ గా వస్తున్న దరఖాస్తులను కూడా ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ఫారం 6, తొలగింపు ఫారం 8 లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో విలువ ఉందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తమ వెబ్ సైట్ లో పెడుతుందని, ఆన్ లైన్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. భవిష్యత్తు అంతా డిజిటల్ మాయం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఓటర్ యాప్, గరుడ యాప్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. స్మార్ట్ ఫోన్ లో గరుడ యాప్ వాడకం పై తిరిగి ఒకసారి శిక్షణ కార్యక్రమం నిర్వహించవలసినదిగా అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ మాట్లాడుతూ జిల్లాలో 4,13,517 మంది ఓటర్లున్నారని తెలిపారు. 1 నవంబర్ 2021 న డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికీ 2,917 మంది కొత్తగా ఓటరు గా నమోదు చేసుకున్నారని, కాగా 4,737 పేర్లు తొలగించడం జరిగిందని అన్నారు. ఈ సంవత్సరం జనవరి 15 న ఓటర్ల తుది జాబితా ప్రకటించేనాటికి 4,12,429 మంది ఓటరు ఉండగా ఈ నవంబర్ 1 నాటికీ 1,088 మంది ఓటర్లు పెరిగారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని మూతం 576 పోలింగ్ కేంద్రాల బ్లాక్ స్థాయి అధికారు వంద శాతం గరుడ యాప్ ద్వారా వివరాలు నమోదు చేస్తున్నారని, అయినా తిరిగి వారికి మరోసారి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పరిశీలకులకు తెలిపారు. ఆర్..డి.ఓ. సాయి రామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సమావేశంలో స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి, అన్ని మండలాల తహసీల్ధార్లు, బ్లాక్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post