58 జిఓ కు క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన కు బృందాల ఏర్పాటు -జిల్లా కలెక్టర్ హరీష్

58 జిఓ కు క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన కు బృందాల ఏర్పాటు  -జిల్లా కలెక్టర్ హరీష్

ప్రభుత్వ ఉత్తర్వు 58 ప్రకారం జిల్లాలో అక్రమంగా 125 గజాలలోపు నిర్మించుకున్న నివాస గృహాలను క్రమబద్దీకరించుటకు వచ్చిన 552 దరఖాస్తులను పరిశీలించుటకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అన్నారు. సోమవారం తన ఛాంబర్ లో అదనపు కలెక్టర్లు ప్రతిమసింగ్, రమేష్ లతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఒక్కో బృందంలో నలుగురు సభ్యులుంటారని ఆ బృందం తమకు కేటాయించిన మండలాలలో వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక అందజేస్తారని అన్నారు. మెదక్, పాపన్నపేట, పెద్ద శంకరంపేట్, హవేళిఘనాపూర్ మండలాలకు డిఆర్.డి.ఓ. ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ నేతృత్వం వహిస్తారని ఇక్కడ రెగ్యులరైజేషన్ కోసం వచ్చిన 217 దరఖాస్తులను తమ బృందంతో పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా నిజాంపేట్, చిన్నశంకరంపేట, అల్లాదుర్గ్, రేగోడ్ మండలాలకు అదనపు డి.ఆర్.డి.ఓ. భీమయ్య నేతృత్వం వహించి అక్కడ వచ్చిన 35 దరఖాస్తులను పరిశీలిస్తారని అన్నారు. నరసాపూర్, కొల్చారం, కౌడిపల్లి, చిల్పిచెడ్ మండలాలకు నేతృత్వం వహిస్తున్న జిల్లా మైన్స్ అధికారి జయరాజ్ 239 దరఖాస్తులను పరిశీలిస్తారని పేర్కొన్నారు. కాగా చేగుంట, నార్సింగి, మనోహరాబాద్, మాసాయిపేట, తూప్రాన్ మండలాలకు బృంద నాయకుడుగా ఉన్న జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణ మూర్తి తన టీమ్ తో ఆయా మండలాల నుండి వచ్చిన 61 దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక అందజేయవలసినదిగా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ.లు సాయిరాం, శ్యామ్ ప్రకాష్, వెంకట ఉపేందర్ రెడ్డి, డిఆర్.డి.ఓ. శ్రీనివాస్, అదనపు డి.ఆర్.డి.ఓ. భీమయ్య, జిల్లా మైన్స్ అధికారి జయరాజ్, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణ మూర్తి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ విశ్వనాధ్ పాల్గొన్నారు.

Share This Post