కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు స్వయంగా ఇంటింటికి తిరిగి పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

ప్రచురణార్ధం

డిశంబరు, 20, ఖమ్మం:

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు స్వయంగా ఇంటింటికి తిరిగి పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సోమవారం ఉదయం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని 16, 18, 19, 21, 22, 23, 24, 25, 26, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58 డివిజన్లలో 574 మంది లబ్ధిదారులకు రూ.3.68 కోట్ల విలువైన చెక్కులను మోటారు. సైకిల్పై పర్యటించి స్వయంగా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె. చంద్రశేఖర్రావు నిరంతరం పేదల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వారి సంక్షేమానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద, నిరుపేదలైన ఆడపిల్ల తల్లితండ్రులు తమ కుమార్తె వివాహానికి అప్పులు చేసి ఆర్ధికంగా ఇబ్బందులకు గురికాకూడదనే సంకల్పంతో ఆలోచన చేసి కళ్యాణలక్ష్మి/ షాదిముబారక్, పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

నగర మేయర్ పునుకొల్లు నీ రజ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, ఖమ్మం అర్బన్ తహశీల్దారు శైలజ, స్థానిక కార్పోరేటర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post