5th day Palle Pragathi programe at Kollapur constituency Mukkidigundam participated by ZP Chairman & Collctor, MLA

పత్రిక ప్రకటన
తేది: 5-7-2021
నాగర్ కర్నూల్ జిల్లా.
ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఊరూరా విజయవంతం చేసి గ్రామాలను పరిశుబ్రంగా పచ్చదనంతో వెల్లివిరిసేలా చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి పిలుపునిచ్చారు. సోమవారం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ యల్. శర్మన్, కొల్లాపూర్ శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఎల్లూరు, ముక్కడిగుండం, పెంటలవెల్లి మండలంలో జటప్రోలు లో జరుగుతున్న పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. జటప్రోలు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆమె మాట్లాడుతూ సరిఅయిన అడవులు లేక చెట్లు లేక పర్యావరణం విషతుల్యం అవుతుందని, కరోనా సమయంలో ఆక్సిజన్ కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు విరివిగా నాటి, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ మాట్లాడుతూ పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమలో భాగంగా సర్పంచులు, అధికారులు తమ గ్రామంలో పారిశుధ్యము, హరితహారం లో చెట్లు నాటడం,వైకుంఠ ధామం, సెగ్రిగేషన్ షెడ్ పూర్తి చేసుకొని గ్రామాన్ని అందంగా అభివృద్ధి చేసుకోవడం లో పోటీ పడాలని సూచించారు. ప్రతి గ్రామంలో సమస్యలు ఉంటాయని వాటిని పరిష్కరించుకుంటు అభివృద్ధిలో పక్కగ్రామంతో పోటీపడాలని పిలుపునిచ్చారు. గ్రామ నిధుల్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కు వెచ్చించాలని, రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల్లో ఎత్తైన మొక్కలు నాటడం, ఎక్కడ చెత్తా చెదారం, మురికి లేకుండా అందమైన గ్రామముగా మార్చుకోవాలన్నారు. అడవుల్లో, రహదారి పొడవునా పండ్ల చెట్లు లేనందున వాటిపై ఆధారపడి జీవించే పక్షులు, జంతువులు ఆకలితో అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణం సమతులయంగా ఉండాలంటే ప్రతిగ్రామములో విరివిగా మొక్కలు నాటాలని అందులో సగం పండ్ల మొక్కలు ఉండేవిదంగా చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు మంజూరు చేస్తామని జటప్రోలు గ్రామస్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలిపారు.
కొల్లాపూర్ శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జటప్రోలు గ్రామంలో చాలాకాలంగా ఉన్న విద్యుత్ సమస్యలను పవర్ వీక్ సందర్బంగా పరిష్కరించుకున్నామని ,గ్రామానికి ప్రత్యేక ఫిడర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రోడ్ల మరమ్మతుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధునాతన బస్ షెల్టర్ ఏర్పాటుకు తన నిధుల నుండీ 10 లక్షలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైనా నాటుసారా తయారు చేస్తే వారిపై పిడి యాక్టు ద్వారా కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు. భూసమస్యల పరిష్కారానికి కలెక్టర్ ద్వారా పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసారు. అంతకుముందు ముక్కిడిగుండం గెమ్యనాయక్ తండాలో 2 ఎకరాల్లో దాదాపు 8 వేల మొక్కలతో ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనం లో మొక్కలు నాటారు. యం.యల్.ఏ క్యాంపు కార్యాలయం లో సైతం మొక్కలు నాటారు
పి.డి.డి.ఆర్.డిఓ నర్సింగ్ రావు, ప్రత్యేకాధికారి లక్మప్ప, ఎంపిడిఓ శేషగిరి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి, డి.యల్.పి.ఓ సాంబిరెడ్డి, ఏ.పి.డి శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ విజయలక్ష్మి, జడ్పిటిసి చిట్టెమ్మ, సర్పంచులు దశరథ్ నాయక్, బండి లక్ష్మి దేవమ్మా, యస్కె ఖాజా, కో అప్షన్ మెంబర్ మతీన్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
———————
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post