6.9.2021. ఉపాధి హామీ పనులకు సంబంధించిన గుడ్ గవర్నెన్స్ పారా మీటర్లను వెంటనే సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు.

Press note. 6.9.2021.

ఉపాధి హామీ పనులకు సంబంధించిన గుడ్ గవర్నెన్స్ పారా మీటర్లను వెంటనే సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు.

సోమవారం నాడు ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీవో, ఏపిడిలు, ఎంపీఓలు, ఎపిఓ లతో మండలాల వారీగా ఉపాధిహామీ పనులకు సంబంధించిన పారామీటర్స్ నిర్వహాణను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు సంబంధించి అతి ముఖ్యమైన నాలుగు అంశాలు జాబ్ కార్డ్ అప్ డేషన్, 7 రిజిస్టర్ల నిర్వహణ, వర్క్ సైట్ బోర్డ్స్ ఏర్పాటు, వర్క్ ఫైల్ పారామీటర్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే గతంలో మండలానికి బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసిన విధంగానే ఇప్పుడు మరో నాలుగు బృహత్ పల్లె ప్రకృతి వనాలకు ఐదు ఎకరాల చొప్పున స్థలం గుర్తించాలని, తహశీల్దార్ల తోడ్పాటుతో వెంటనే పూర్తి చేయాలని సూచించారు. గతంలో పల్లె ప్రకృతి వనానికి పది ఎకరాల స్థలం గుర్తించే సమయంలో 5 ఎకరాల స్థలాలను చూడడం జరిగిందని, ప్రస్తుతం వాటిని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం పనులను పకడ్బందీగా నిర్వహించాలని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.

టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పాల్గొన్నారు.

……….DPRO. KMR

Share This Post